Health: శరీరంలో కాల్షియం ఎక్కువైనా ప్రమాదమే సుమా.. ఎలాంటి అనర్థాలు కలుగుతాయో తెలుసా.?

Health: ఎములకు దృఢంగా ఉండాలంటే శరీరానికి సరిపడ కాల్షియం అందాలనే విషయం మనందరికీ తెలిసిందే. కాల్షియం సరిగా అందకపోతే చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల వంటి సమస్యలతో..

Health: శరీరంలో కాల్షియం ఎక్కువైనా ప్రమాదమే సుమా.. ఎలాంటి అనర్థాలు కలుగుతాయో తెలుసా.?
Health Problem

Edited By:

Updated on: Oct 31, 2021 | 7:38 AM

Health: ఎములకు దృఢంగా ఉండాలంటే శరీరానికి సరిపడ కాల్షియం అందాలనే విషయం మనందరికీ తెలిసిందే. కాల్షియం సరిగా అందకపోతే చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల వంటి సమస్యలతో బాధపడుతుంటాం. అయితే చాలా వరకు మనం తీసుకునే ఆహారంతోనే శరీరానికి అవసరమైన మేర కాల్షియం అందుతుంది. కానీ కొందరిలో మాత్రం కాల్షియం లేమి కారణంగా సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి వారి కోసమే వైద్యులు కాల్షియం ట్యాబ్లెట్లను వాడాల్సిందిగా సూచిస్తుంటారు. అయితే ఇది హద్దు మీరితో మాత్రం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి కాల్షియం అవసరమే కానీ.. ఎక్కువైతే కూడా ప్రమాదమని చెబుతున్నారు.

సాధారణంగా పురుషులకు నిత్యం 1000 నుంచి 1200 మిల్లీగ్రాముల మోతాదులో కాల్షియం అవసరం ఉంటుంది. అదే స్త్రీలు అయితే నిత్యం 1200 నుంచి 1500 మిల్లీగ్రాముల మోతాదులో కాల్షియం తీసుకోవాలి. పిల్లలకు 1300 నుంచి 2500 మిల్లీగ్రాముల మోతాదులో కాల్షియం అవసరం అవుతుంది. ఈ మోతాదులోనే నిత్యం కాల్షియం అందేలా చూసుకోవాలి. ఎక్కువైతే మాత్రం దుష్ఫ్రభాలు తప్పవు.

ముఖ్యంగా శరీరంలో కాల్షియం స్థాయి ఎక్కువైతే.. కిడ్నీలు దాన్ని ఫిల్టర్‌ చేయలేవు. ఫలితంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి. అలాగే కాల్షియం ఎక్కువైతే బీపీ కూడా పెరుగుతుంది. కాల్షియం పరిమాణం ఎక్కువైతే ఎముకలకు దృఢంగా మారకపోగా పెళుసుగా మారుతాయి. దీంతో అవి సులభంగా విరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి సప్లిమెంటరీ ట్యాబ్లెట్లు వాడే వారు వైద్యుల సూచనలు తీసుకుంటూ వాడడం మంచిది.

Also Read: Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టైరు పేలి లారీని ఢీకొన్న కారు.. నలుగురు మృతి

Pushpaka Vimanam: అల్లు అర్జున్ వదిలిన ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ ట్రైలర్..

CBSE Board Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల టర్మ్‌-1 పరీక్షలు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..!