Benefits Of Tamarind: చింతపండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. మీరు దానిని తినుకుండా ఉండలేరు..

|

Nov 20, 2022 | 8:02 PM

చింతపండును ఎక్కువుగా వంటల్లో వాడుతుంటారు. కూరల్లో పులుపు కోసం, రుచికోం చింతపండుని వాడుతుంటారు. అయితే చింతపండును వంటకాల్లో కాకుండా మాములుగా తింటే పళ్ళు పులిసి పోతాయి. అయితే చింతపండును డైట్లో కచ్చితంగా చేర్చుకోవాలంటున్నారు ఆహార..

Benefits Of Tamarind: చింతపండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. మీరు దానిని తినుకుండా ఉండలేరు..
Tamarind
Follow us on

చింతపండును ఎక్కువుగా వంటల్లో వాడుతుంటారు. కూరల్లో పులుపు కోసం, రుచికోం చింతపండుని వాడుతుంటారు. అయితే చింతపండును వంటకాల్లో కాకుండా మాములుగా తింటే పళ్ళు పులిసి పోతాయి. అయితే చింతపండును డైట్లో కచ్చితంగా చేర్చుకోవాలంటున్నారు ఆహార నిపుణులు. చింతపండు కూడా అనేక పోషకాలతో నిండి ఉంటుంది. సాధారణంగా చింతపండు పుల్లని గుజ్జు కలిగి ఉంటుంది. అది పండినప్పుడు కాస్త తీపిగా మారుతుంది. అందుకే వీటిని వివిధ సాస్‌లు, క్యాండీలు, పానీయాలు, చట్నీలలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయంటున్నారు నిపుణులు. చింతపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

బరువు తగ్గడానికి..

చింతపండు బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. ఫైబర్, జీరో ఫ్యాట్ కంటెంట్‌తో నిండిన చింతపండు అధిక మొత్తంలో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్‌లను కలిగి ఉంటుంది. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. చింతపండులో హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్‌లను కొవ్వుగా మార్చడానికి కారణమయ్యే ఎంజైమ్ అయిన అమైలేస్‌ను అడ్డుకోవడం ద్వారా ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియకు..

మాలిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, పొటాషియంతో నిండిన చింతపండు పురాతన కాలం నుంచి సహజ భేదిమందుగా ఉపయోగిస్తున్నారు. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని కచ్చితంగా మెరుగుపరుస్తుంది. పొత్తికడుపు కండరాలను సడలించే సామర్థ్యం దీనికి ఉంది. కాబట్టి దీనితో అతిసారాన్ని కూడా నయం చేయవచ్చు. వీటిలోని పొటాషియం బిటార్ట్రేట్ మలబద్ధకం, కడుపు నొప్పి నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది. అధ్యయనాల ప్రకారం.. చింతపండు బెరడు, వేరు పదార్దాలు కడుపునొప్పిని తగ్గించడంలో దోహదపడతాయి.

ఇవి కూడా చదవండి

చర్మ ఆరోగ్యం కోసం..

చింతపండు చర్మ ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది. చింతపండులోని ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. మృతకణాలు, ఇతర మలినాలను తొలగించి.. కాంతివంతమైన, లేత రంగును అందిస్తాయి. చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, తేమగా ఉంచడంలో సహాయపడతాయి. అదే సమయంలో అదనపు సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. చింతపండులోని యాంటీ ఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. తద్వార చర్మంలో మెలనిన్ కంటెంట్‌ను తగ్గిస్తుంది.

మధుమేహ నియంత్రణ

మధుమేహం నిర్వహణలో చింతపండు బాగా సహాయం చేస్తుంది. దానిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడతాయి. మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులలో ప్యాంక్రియాటిక్ కణజాలం నష్టాన్ని చింతపండు కూడా తిప్పికొడుతుంది. చింతపండు గింజలు ప్యాంక్రియాటిక్ బీటా కణాల నియోజెనిసిస్‌ను పెంచుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పునరుద్ధరిస్తాయి. ఇందులో ఆల్ఫా-అమైలేస్ కూడా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యానికి

చింతపండు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. చింతపండులోని ఫ్లేవనాయిడ్స్ చెడు లేదా ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో మంచి లేదా హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇది రక్తంలో ట్రైగ్లిజరైడ్‌ల పెరుగుదలను నిరోధిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..