Health Tips: ఈ కూరగాయలతో డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.. జాబితాలో ఏమేం ఉన్నాయంటే?

|

Aug 01, 2022 | 1:49 PM

Diabetes: అన్ని పండ్లు, కూరగాయలు ఒకే విధమైన పోషక విలువలను కలిగి ఉండవు.కొన్ని కూరగాయలలో సోడియం అధికంగా ఉండవచ్చు. మరికొన్నింటిలో పొటాషియం లేదా ఇతర విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండవచ్చు.

Health Tips: ఈ కూరగాయలతో డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.. జాబితాలో ఏమేం ఉన్నాయంటే?
Vegetables
Follow us on

Diabetes: అన్ని పండ్లు, కూరగాయలు ఒకే విధమైన పోషక విలువలను కలిగి ఉండవు.కొన్ని కూరగాయలలో సోడియం అధికంగా ఉండవచ్చు. మరికొన్నింటిలో పొటాషియం లేదా ఇతర విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండవచ్చు. ఇక శరీరానికి విటమిన్లు, ఖనిజాలు ఎంతో అవసరం. ఎందుకంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే అన్ని పండ్లు లేదా కూరగాయలు ఆరోగ్యకరమైనవి కావు ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది. అలాగే వివిధ వివిధ కూరగాయలు వేర్వేరు పోషక విలువలను కలిగి ఉంటాయి. ఈక్రమంలో మన శరీర స్థితి, ఆరోగ్య పరిస్థితులను బట్టి పండ్లు, కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుంది.

క్యాబేజీ

ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్‌లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. ఇక క్యాబేజీలోని విటమిన్ కె రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

వంకాయ

ఇందులో ఫైబర్‌ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే రక్తంలో కార్బోహైడ్రేట్ల శోషణ ప్రక్రియను నెమ్మదిస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది.

బ్రోకలీ

ఈ కూరగాయలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కార్బోహైడ్రేట్ల శోషణ ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపుచేస్తాయి. అలాగే ఇది కడుపులోని మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తిచేస్తుంది. ఫలితంగా ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

కాలీఫ్లవర్

బ్రోకలీ మాదిరిగానే కాలీఫ్లవర్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రిస్తాయి. అలాగే పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తాయి. ఫలితంగా బరువు తగ్గేలా సహాయపడతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)