Diabetes Patients: డయాబెటిస్‌తో బాధపడేవారికి క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. ఇందులో అనారోగ్యకరమైన ఆహారం, అధిక ఒత్తిడి, పేలవమైన జీవనశైలి కారణంగా చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు క్రమం తప్పకుండా యోగా లేదా వ్యాయామం చేయడం వల్ల మంచి లాభాలుంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇవి చాలా వరకు సహాయపడతాయి. డయాబెటిక్ పేషెంట్లు బ్లడ్ షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేయడానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలో తెలుసుకుందాం.
వాకింగ్‌తో ప్రయోజనాలు..
నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు వాకింగ్ కోసం కొంత సమయం కేటాయిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఒక వేళ వాకింగ్ కోసం బయటకు వెళ్లలేకపోతే ఇంటి టెర్రస్ మీద నడవవచ్చు. రెగ్యులర్ వాకింగ్ అన్ని డయాబెటిక్ రోగులలో, ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగులలో రక్తపోటు, బ్లడ్ షుగర్ మెయింటెన్ చేయడంలో సహాయపడుతుంది. అందువల్ల ప్రతిరోజూ 15 నుండి 20 నిమిషాలు క్రమం తప్పకుండా నడవండి. దీని వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
స్విమ్మింగ్‌తో..
మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఈతకు వెళ్లవచ్చు. స్విమ్మింగ్ అనేది కార్డియో వ్యాయామం. ఇది ఫిట్‌గా ఉండటమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఈత కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈత మధుమేహ రోగులలో గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అందువల్ల మీరు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి స్విమ్మింగ్ కూడా చేయవచ్చు.
యోగాతో టైప్-2 డయాబెటిస్ అదుపులో..
మీరు క్రమం తప్పకుండా యోగా చేస్తే టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో యోగా సహాయపడుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా సహకరిస్తుంది. యోగా చేయడం వల్ల కూడా బరువు తగ్గుతారు. ఇది నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. యోగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
సైక్లింగ్..
అధ్యయనాల ప్రకారం.. సైక్లింగ్ రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. రెగ్యులర్ సైక్లింగ్ కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందేందుకు పనిచేస్తుంది. ఇది కీళ్ల నొప్పులకు ఉపశమనం కలిగిస్తుంది. సైకిల్ తొక్కడం కూడా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహంతో బాధపడే వారికి ఇది చాలా మేలు చేస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి