Diabetes Diet: డయాబెటిక్‌ రోగులు ఏ పండ్లు తినాలి? ఏవి తినకూడదు?

నేటి జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరూ మధుమేహంతో బాధపడుతున్నారు. దీంతో ఏ పండు తినాలో.. ఏది తినకూడదో తెలియక తికమకపడిపోతున్నారు. డయాబెటిక్ రోగులందరిలో ఇది సాధారణ సమస్య. ఇకపై ఏ పండ్లు తినాలి, ఏ పండ్ల రసాలు తాగాలి అనే విషయంలో ఆందోళన చెందవల్సిన అవసరం లేదు. మధుమేహంతో బాధపడేవారు ఏయే విధమైన పండ్లను తీసుకోవాలో ఆరోగ్య నిపుణుల మాటల్లో మీకోసం.. శరీరంలో షుగర్ లెవెల్స్‌ సరిగ్గా నిర్వహించనప్పుడు డయాబెటిస్ వస్తుంది..

Diabetes Diet: డయాబెటిక్‌ రోగులు ఏ పండ్లు తినాలి? ఏవి తినకూడదు?
Diabetes Diet
Follow us

|

Updated on: Apr 21, 2024 | 12:23 PM

నేటి జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరూ మధుమేహంతో బాధపడుతున్నారు. దీంతో ఏ పండు తినాలో.. ఏది తినకూడదో తెలియక తికమకపడిపోతున్నారు. డయాబెటిక్ రోగులందరిలో ఇది సాధారణ సమస్య. ఇకపై ఏ పండ్లు తినాలి, ఏ పండ్ల రసాలు తాగాలి అనే విషయంలో ఆందోళన చెందవల్సిన అవసరం లేదు. మధుమేహంతో బాధపడేవారు ఏయే విధమైన పండ్లను తీసుకోవాలో ఆరోగ్య నిపుణుల మాటల్లో మీకోసం.. శరీరంలో షుగర్ లెవెల్స్‌ సరిగ్గా నిర్వహించనప్పుడు డయాబెటిస్ వస్తుంది. శరీరంలో ఇన్సులిన్ సరైన మోతాదులో ఉత్పత్తి కాకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. కొంతమందికి పుట్టినప్పటి నుంచి ఈ సమస్య ఉంటుంది. మరి కొందరిలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా షుగర్ స్థాయిలు పెరుగుతాయి. ఖాళీ కడుపుతో షుగర్ లెవెల్ 100 mg/dL కంటే ఎక్కువగా ఉంటే అది మధుమేహానికి సంకేతం. అలాగే ఆహారం తిన్న తర్వాత చక్కెర స్థాయి 140 mg/dl కంటే ఎక్కువగా ఉంటే మధుమేహం బారిన పడినట్లు లెక్క. ఒక్కసారి ఈ వ్యాధి వస్తే దానికి చికిత్స లేదు. ఆరోగ్య సృహతో దీన్ని నియంత్రించడం ఒక్కటే మార్గం.

డయాబెటిస్‌ వ్యాధి గ్రస్తులు ఏ పండ్లు తినాలి..?

డయాబెటిక్ రోగులు అధికంగా పండ్లు తినాలని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ సలహా ఇస్తుంది. అయితే అందుకు మధుమేహం ఉన్నవారు తరచుగా తమ సొంత డైట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని ఢిల్లీలోని లేడీ హార్డింజ్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుభాష్ గిరి చెప్పారు. తరచూ తమ ఆహారంలో చక్కెర పరిమాణాన్ని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలి. కార్బోహైడ్రేట్లను అధికంగా తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే చాల వరకు పండ్లలో కార్బోహైడ్రేట్లు, చక్కెర అధికంగా ఉంటాయి. పండ్లలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఉన్న ఆహారాలు జీర్ణం కావడానికి తక్కువ సమయం పడుతుంది. కాబట్టి అవి రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెంచుతాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పండ్లను తినాలో, ఏది తినకూడదో ఇక్కడ తెలుసుకోవడం ముఖ్యం.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పండ్లు తినాలంటే..

  • కివి
  • యాపిల్
  • నారింజ
  • స్ట్రాబెర్రీ
  • చెర్రీ

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పండ్లు తినకూడదు

  • పుచ్చకాయ
  • అనాస పండు
  • అరటిపండు
  • మామిడి

డయాబెటిస్‌లో పండ్ల రసం తాగవచ్చా?

సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ దీపక్ కుమార్ సుమన్ మాట్లాడుతూ.. పండ్లరసం తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో డయాబెటిక్ రోగులు పండ్ల రసాలను త్రాగకూడదు. ముఖ్యంగా ప్యాక్‌డ్ జ్యూస్‌ని తాగకూడదు. దీనికి బదులుగా పండ్లు తినడం మంచిది. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. కానీ ఎక్కువ పండ్లు తినకూడదు. పండ్లను ఎక్కువగా తినడం వల్ల మధుమేహం షుగర్ స్థాయిని పెంచుతుంది. డ్రై ఫ్రూట్స్‌కు బదులుగా తాజా పండ్లను తినడానికి ప్రయత్నించాలి.

ఇవి కూడా చదవండి

ఎన్ని పండ్లు తినాలి?

డయాబెటిక్ పేషెంట్లు ప్రతిరోజూ ఒకటి నుంచి రెండు పండ్లను ఆహారంలో చేర్చుకోవచ్చని డాక్టర్ దీపక్ అంటున్నారు. పండ్లను ఉదయాన్నే తింటే ఇంకా ఆరోగ్యానికి మంచిది. ఆహారంతో పాటు పండ్లను ఎప్పుడూ తినకూడదు. రాత్రి వేళల్లో కూడా పండ్లను తినకపోవడమే మంచిది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..