డ్రైవింగ్ లో వెన్నునొప్పి.. ఇలా చేస్తే నొప్పి మటాష్..

TV9 Telugu

03 May 2024

చాలా సేపు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు వెన్నునొప్పి సమస్య ఉండవచ్చు. దీనికి మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు.

కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఈ నొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈరోజు అలాంటి చిట్కాల గురించి తెలుసుకుందాం.

సాధారణంగా కొంతమంది సీటుపై కూర్చున్నప్పుడు కొద్దిగా ముందుకు వంగి డ్రైవింగ్‌ చేస్తారు. దీని కారణంగా వారి చేతుల మధ్య సరైన గ్యాప్ ఏర్పడదు.

దీంతో వెన్ను భాగంలో నొప్పి ఉంటుంది. అందుకే మీరు సౌకర్యవంతంమైన ఫీలింగ్‌ కలిగేవరకు మీ సీటును ముందుకు వెనుకకు కదపండి.

ఎయిర్‌బ్యాగ్ పనిచేయాలంటే మీకు స్టీరింగ్ వీల్‌కు మధ్య కనీసం 25 నుంచి 30 సెంటీమీటర్ల దూరం ఉండాలని గుర్తుంచుకోండి.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు 90° డిగ్రీల కోణం నుంచి ప్రారంభించి 10 నుంచి 20 డిగ్రీల కంటే ఎక్కువ వెనక్కి వెళ్లకూడదు.

డ్రైవింగ్ చేసేటప్పుడు నొప్పిని నివారించడానికి సౌకర్యవంతంగా ఉండటానికి మీ ఎత్తును కూడా సర్దుబాటు చేసుకోవాలి.

మీ మోకాలు సీటు దిగువకు తగలకుండా చూసుకోండి. అలాగే సీటును చాలా ఎత్తుకు పెంచకండి. ఎందుకంటే ఇది రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది.