Diabetes: ప్రపంచ వ్యాప్తంగా వెంటాడుతున్న వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. చిన్నా పెద్ద అనే వయసుతో తేడా లేకుండా వ్యాపిస్తోంది. ఎందుకుంటే ఈ మధుమేహం వంశపారపర్యంగా, ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాటు, జీవన విధానం కారణంగా చాలా మందికి వస్తుంటుంది. అయితే ఈ డయాబెటిస్‌ను ఆహారపు అలవాట్ల వల్ల అదుపులో ఉంచుకోవాలి తప్ప పూర్తిగా నివారించలేము.ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఆహార నియమాలు పాటించడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఆహార నియమాలు పాటించడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. నేటి కాలంలో మధుమేహం తీవ్రమైన వ్యాధి. ఇది చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సోకుతుంది. ఎందుకంటే తినే ఆహారం కారణంగా, మానసిక ఒత్తిడి, ఆందోళన తదితర కారణాల వల్ల ఈ వ్యాధి రోజురోజుకు మరింతగా వ్యాపిస్తోంది. అయితే ఈ వ్యాధి వచ్చిన తర్వాత పూర్తిగా నయం చేయలేము కానీ.. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల అదుపులో ఉంచుకోవచ్చు. లేకపోతే వివిధ అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహానికి కారణం జీవనశైలి, వృద్ధాప్యం, ఊబకాయం, ఒత్తిడి కావచ్చు. దీని కారణంగా గుండె సంబంధిత వ్యాధుల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవడానికి మీరు ఆహారంలో పండ్లు, పచ్చి కూరగాయలు, తృణధాన్యాలు చేర్చవచ్చు. వైద్య నిపుణుల వివరాల ప్రకారం.. ఆహారంలో ఏ విషయాలు తీసుకోవాలి.. షుగర్ స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్ ఆహారాలు తినండి:
కార్బోహైడ్రేట్లు ఉండే పదార్థాలు మన చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్‌లను ఏయే పదార్థాలు కలిగి ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిండి పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
తక్కువ ఉప్పు తినండి:
ఎక్కువ మొత్తంలో ఉప్పు తినడం వల్ల రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. దీని కారణంగా గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఉప్పును తక్కువ తీసుకోవడం బెటర్.
పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి:
ఈ వ్యాధి ఉన్నవారు ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు వంటి వాటికి పోషకాలుగా పనిచేసే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి.
ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను ఎంచుకోండి:
మనందరం మన రోజువారీ దినచర్యలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను చేర్చాలి. ఇది ఎంతో శక్తిని ఇస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులలో విత్తనాలు, ఉప్పు లేని గింజలు, అవోకాడోలు, చేపలు, పొద్దుతిరుగుడు నూనె, ఆలివ్ నూనె ఉన్నాయి.
ఆల్కహాల్ తాగడం మానుకోండి:
మధుమేహం ఉన్నవారు ఆల్కహాల్ తాగడం మానుకోవాలి. ఇది డయాబెటిక్ రోగులకు హానికరం. ఇది చక్కెర స్థాయిని పెంచుతుంది. దీని వలన ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
ఆహారంలో ఖనిజాలు, విటమిన్ పదార్థాలు చేర్చండి:
ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది. ఈ పదార్థాలు మిమ్మల్ని శారీరకంగా చురుకుగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతాయి.
(గమనిక: ఈ వివరాలన్ని వైద్య నిపుణులు సలహాలు, సూచనల మేరకు ఇవ్వడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్య నిపుణులను సంప్రదించండి)
ఇవి కూడా చదవండి: