Dengue Fever: రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ సహజంగాపెంచుకునే చిట్కాలు ఇవే.. ఇలా చేస్తే డెంగ్యూ జ్వరానికి చెక్..

ఈ డెంగ్యూ ఇన్ ఫెక్షన్ శరీరంలోకి పెరిగితే ప్రధానంగా రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిపోతుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు కోల్పోవల్సి వస్తుంది. అందుకే రక్తంలో ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచుకోవడం చాలా అవసరం. సహజ పద్ధతుల్లో ప్లేట్ కౌంట్ పెంచడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Dengue Fever: రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ సహజంగాపెంచుకునే చిట్కాలు ఇవే.. ఇలా చేస్తే డెంగ్యూ జ్వరానికి చెక్..
Dengue Fever

Updated on: Aug 22, 2023 | 4:00 PM

డెంగ్యూ విజృంభిస్తోంది. దోమకాటు వల్ల వచ్చే ఈ జ్వరం నెమ్మదిగా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది ఇప్పుడు డెంగ్యూ ప్రమాదంలో ఉంది. ప్రతి సంవత్సరం 100-400 మిలియన్ ఇన్ఫెక్షన్లు సంభవిస్తున్నాయని వివరిస్తోంది. ఉష్ణమండల, ఉప ఉష్ణమండల వాతావరణంలో ఇది ఎక్కువగా కనిపిస్తుందని ప్రకటించింది. ప్రస్తుతం మన దేశంలో కూడా డెంగ్యూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లోనే దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 300 కేసులు నమోదయ్యాయి. ఇటీవల వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల నుంచి నీరు తగ్గుముఖం పట్టడంతో అక్కడ ఈ తరహా వ్యాధులు పెరిగాయి. అయితే ఈ డెంగ్యూ ఇన్ ఫెక్షన్ శరీరంలోకి పెరిగితే ప్రధానంగా రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిపోతుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు కోల్పోవల్సి వస్తుంది. అందుకే రక్తంలో ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచుకోవడం చాలా అవసరం. సహజ పద్ధతుల్లో ప్లేట్ కౌంట్ పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలను ఇప్పుడు చూద్దాం..

ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా అవసరం. శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుకోవడానికి హైడ్రేషన్ ముఖ్యం. పెరిగిన ద్రవ వినియోగం శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది. వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. హెర్బల్ టీలు, సూప్, లెమన్ వాటర్ వంటివి తీసుకుంటూ ఉండాలి.

గ్రీన్ వెజ్జీలను తీసుకోండి.. ఇష్టమైనవి కానప్పటికీ, ఆకు కూరలను ప్రతిరోజూ భోజనంలో చేర్చుకోవాలి. ఈ కూరగాయలు రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్యను మెరుగుపరచడానికి, రికవరీ వేగాన్ని పెంచడానికి అవసరమైన అన్ని పోషకాలను కలిగి ఉంటాయి. బీట్‌రూట్, బ్రోకలీ, బచ్చలికూర వంటి కూరగాయలలో ఐరన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి గట్ బ్యాక్టీరియాను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

 మూలికలు, సుగంధ ద్రవ్యాలు.. మూలికలు, సుగంధ ద్రవ్యాలు ప్రత్యేకంగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి, బ్లడ్ ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడతాయి. పసుపు, అల్లం, దాల్చిన చెక్క, మిరియాలు, వెల్లుల్లి డెంగ్యూ జ్వరం నుండి కోలుకోవడానికి సహాయపడే కొన్ని ఉత్తమ మూలికలు. పైగా ఇవి మీ వంటగదిలోనే అందుబాటులో ఉంటాయి.

తినాల్సిన పండ్లు.. ప్లేట్‌లెట్స్‌ పెరగడానికి పండ్లు కూడా ముఖ్యమైనవి. ప్లేట్‌లెట్స్ పెరగాలంటే పోషకాలు, విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కోలుకోవడానికి కివీస్, చెర్రీస్, యాపిల్స్ మీ ఫ్రూట్ బౌల్‌లో చేర్చవచ్చు.

ప్రోబయోటిక్స్.. ప్రోబయోటిక్ ఆహారం జీర్ణక్రియలో ప్రధానంగా సహాయపడుతుంది. ఇది మంచి పేగు బాక్టీరియాను మెరుగుపరుస్తుంది. పెరుగు, సోయాబీన్స్, కెఫిన్, మజ్జిగ కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

డెంగ్యూ జ్వరం లక్షణాలు ఇవి.. తీవ్రమైన జ్వరం, వికారం, వాంతులు, కళ్ళ వెనుక నొప్పి, కీళ్ల నొప్పి, నిరంతర తలనొప్పి

డెంగ్యూ నివారణ ఇలా..

  • ఫుల్ స్లీవ్స్ బట్టలు, లోయర్స్ ధరించండి.
  • సరైన పరిశుభ్రత పాటించండి.
  • పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
  • నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
  • దోమల నివారణ మందులు ధరించండి.
  • రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తినండి.
  • హైడ్రేటెడ్ గా ఉండండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..