రోజంతా కూర్చునే ఉంటున్నారా.. పిరుదులకు పెరుగుతున్న ప్రమాదం.. తస్మాత్ జాగ్రత్త సుమా..

నేటి జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకూ కాలంతో పోటీ పడుతూ ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. శారీరక శ్రమ కూడా తగ్గింది. అదే సమయంలో గంటల తరబడి నిరంతరం కూర్చొని పనిచేయడం వల్ల డెడ్ బట్ సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం కూడా పెరుగుతోంది. ఈ రోజు డెడ్ బట్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఏ సమస్యలు వస్తాయి? ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం..

రోజంతా కూర్చునే ఉంటున్నారా.. పిరుదులకు పెరుగుతున్న ప్రమాదం.. తస్మాత్ జాగ్రత్త సుమా..
Dead Butt Syndrome

Updated on: Jul 24, 2025 | 11:41 AM

ప్రస్తుతం ఎక్కువ మంది శారీరక శ్రమ తగ్గింది. ప్రజలు గంటల తరబడి ఆఫీసులో కూర్చొని పని చేస్తున్నారు. ఇలా నిరంతరం కూర్చుని గంటల తరబడి పనిచేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఒక వైపు ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతోంది. మరోవైపు కొత్త సమస్య డెడ్ బట్ సిండ్రోమ్ బారిన పడే అవకాశం ఉంది. నిరంతరం కూర్చోవడం వల్ల తుంటి పని చేయడం మర్చిపోతుంది. అప్పుడు చాలా సమస్యలు వస్తాయి. ఈ వ్యాధి గురించి అనేక విషయాలను వైద్యులు చెప్పారు. ఎక్కువసేపు ఒకే చోట కూర్చునే అలవాటు శరీరంలోని కండరాలపై, ముఖ్యంగా గ్లూట్ కండరాలపై చెడు ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు. దీనిని ‘డెడ్ బట్ సిండ్రోమ్’ అంటారు.

ఈ సమస్య తుంటికి మాత్రమే పరిమితం కాదు

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల తుంటి కండరాలు బలహీనపడతాయి సమతుల్యత తగ్గుతుంది. ఈ సమస్య తుంటికి మాత్రమే పరిమితం కాదని.. నడుస్తున్నప్పుడు వెన్నునొప్పి, మోకాళ్లపై ఒత్తిడి, నడకలో సమస్యలు, అసమతుల్యతకు కూడా కారణమవుతుందని ఆయన అన్నారు. కనుక నిరంతరం కుర్చుని ఉద్యోగం చేసే వ్యక్తులు ప్రతి 30 నుంచి 45 నిమిషాలకు కూర్చీలో నుంచి లేచి శరీరాన్ని సాగదీయడం, నడవడం, చురుకైన జీవనశైలిని అవలంబించాలి. ఇలా చేయడం వలన ‘డెడ్ బట్ సిండ్రోమ్’ను నివారించడమే కాదు వెన్నెముక, కండరాల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

డెడ్ బట్ సిండ్రోమ్ లక్షణాలు ఏమిటి?

  1. ఎక్కువసేపు కూర్చున్న తర్వాత తుంటిలో తిమ్మిరి , తుంటిలో తేలికపాటి నొప్పి
  2. తీవ్రమైన సందర్భాల్లో తుంటిలో తేలికపాటి నొప్పి కాళ్ళకు లేదా వీపుకు కూడా వ్యాపించవచ్చు.
  3. ఇవి కూడా చదవండి
  4. ఒక వైపు పడుకున్నప్పుడు కూడా నొప్పి కలుగుతుంది. మోకాళ్లు, చీలమండలు, పాదాలలో నొప్పి ఇబ్బంది పడవచ్చు.
  5. నడక శైలిలో మార్పు .. శరీర సమతుల్యత కోల్పోవడం
  6. డెడ్ బట్ సిండ్రోమ్ ఎందుకు జరుగుతుంది?
  7. గంటల తరబడి ఒకే స్థితిలో కూర్చోవడం
  8. వ్యాయామం చేసే ముందు శరీరం సాగదీయకుండా.. డైరెక్ట్ గా భారీ వ్యాయామం చేయడం
  9. తుంటి వంగుట కండరాల బిగుతు (తొడ , నడుము మధ్య కండరాలు)
  10. తుంటి కండరాల బలహీనత, సడలింపు

ఎవరికీ ఎక్కువ ప్రమాదం

  1. ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీనితో పాటు ఈ వ్యాధి  డ్యాన్స్ చేసే వారికి, గాయపడిన వారిలో కూడా కనిపిస్తుంది.
  2. దీనిని నివారించడానికి ప్రతి గంటకు లేచి నడవండి లేదా సాగదీయండి. లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఉపయోగించండి.
  3. ఇలా చేయడం తుంటి కండరాలను చురుకుగా ఉంచుతుంది. కొన్ని వ్యాయామాలు కూడా దీనికి సహాయపడతాయి.

వ్యాధి నుంచి ఉపశమనం ఎలా పొందాలంటే

  1. వాపు వచ్చిన శరీర భాగాల్లో ఐస్​ ప్యాక్‌ ని అప్లై చేయాలి.
  2. కూర్చుని ఉద్యోగం చేసేవారు మధ్యమధ్యలో నిమిషాల బ్రేక్‌ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
  3. బ్రేక్​ తీసుకున్నప్పుడు శరీరం రిలాక్స్ అయ్యేందుకు తెలిపకపాటి వాకింగ్​ , జాగింగ్‌, మెట్లెక్కడం, దిగడం.. వంటివి చేయాల్సి ఉంటుంది.
  4. ఎక్కువ సమయం కూర్చునే వారు తమ పాదాల వద్ద ఎత్తు ఉండేలా ఏదైనా సపోర్ట్‌ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
  5. పిరుదుల్లోని కండరాలు దృఢంగా ఉండేందుకు హామ్‌స్ట్రింగ్‌ వ్యాయామాలు, స్క్వాట్స్‌, కాళ్లు పైకెత్తి చేసే వ్యాయామాలతో పాటు ఈత, డ్యాన్స్‌ చేయడం, ఆటలాడడం.. వంటివి చేయాలి.
  6. వాటర్ కూడా అధికంగా తీసుకోవాలి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)