Banana: అరటిపండుతో పాటు ఈ ఫ్రూట్ కలిపి తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

|

Apr 02, 2022 | 2:25 PM

అరటిపండు(Banana) అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే అరటిపండుతో పాటు కొన్ని పండ్లను కలిపి తినకూడదని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు...

Banana: అరటిపండుతో పాటు ఈ ఫ్రూట్ కలిపి తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
Banana
Follow us on

అరటిపండు(Banana) అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే అరటిపండుతో పాటు కొన్ని పండ్లను కలిపి తినకూడదని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు. అందువల్ల విభిన్న స్వభావాలు కలిగిన పండ్లను కలిపి తింటే మీరు తీవ్రమైన అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని వివరిస్తున్నారు. అరటిపండు తీసుకోవడం వల్ల గుండె(Heart) రక్తప్రసరణతో పాటు పొట్టకు మేలు జరుగుతుంది. మరోవైపు బొప్పాయి(papaya) తినడం వల్ల జీర్ణక్రియ కూడా బాగుంటుంది. దానితో పాటు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రెండు పండ్ల భిన్నమైన స్వభావాలు కలిగి ఉండడం వల్ల ఇలాంటి హానికరమైన ఫ్రూట్ కాంబినేషన్ తినకపోవడమే మంచిదని చెబుతున్నారు.

ఆయుర్వేదంలో ఈ పండ్లు కలిపి తినడం నిషేధం. సాధారణంగా అరటి స్వభావం చల్లగా ఉంటే, బొప్పాయి ప్రభావం వేడిగా ఉంటుంది. వీటిని కలిపి తినడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగకపోవడం, వాంతులు, తలనొప్పి, వికారం, అసెడిటీ, అలర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి.గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదు. ఎందుకంటే దీని ప్రభావం వేడిగా ఉండడం వల్ల కడుపులో పిండాన్ని దెబ్బతీస్తుంది.

అనేక పరిశోధనల ద్వారా ఉబ్బసం లేదా ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులు బొప్పాయి తినడం వల్ల ఆ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ముఖంపై మొటిమలు, దురద సమస్య ఉండొచ్చు. కాబట్టి అలాంటి సమస్య ఉన్న వాళ్లు బొప్పాయి తినే ముందు వైద్యుడ్ని సంప్రదించడం మేలు. బొప్పాయిలోని పీచు పదార్థం మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుందనేది వాస్తవం. అయితే పీచు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది.

NOte: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Read Also.. Diabetes Diet: మీకు డయాబెటిస్ ఉందా..? అయితే మీ ఆహారంలో ఈ పండును చేర్చుకోండి..