Custard Apple Benefits: సీతాఫలాలతో అదిరిపోయే బెనిఫిట్స్‌.. డయాబెటిస్‌, గుండె జబ్బులున్నవారు తినొచ్చా..?

Custard Apple Benefits: ఇప్పుడున్న కాలంలో చాలా మందిలో ఇమ్యూనిటి లెవల్స్‌ తగ్గిపోతున్నాయి. అలాగే రకరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. కారణం.. తినే ఆహారం, అధిక..

Custard Apple Benefits: సీతాఫలాలతో అదిరిపోయే బెనిఫిట్స్‌.. డయాబెటిస్‌, గుండె జబ్బులున్నవారు తినొచ్చా..?
Custard Apple Benefits

Updated on: Oct 23, 2021 | 11:52 AM

Custard Apple Benefits: ఇప్పుడున్న కాలంలో చాలా మందిలో ఇమ్యూనిటి లెవల్స్‌ తగ్గిపోతున్నాయి. అలాగే రకరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. కారణం.. తినే ఆహారం, అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన, పీల్చే గాలి తదితర కారణాల వల్ల ఆరోగ్యానికి గురవుతున్నారు. అయితే ప్రతి రోజు పండ్లను తినడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి. వీటి వల్ల వివిధ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. కొన్ని పండ్లు ఏడాది పొడవునా లభిస్తుంటే.. మరి కొన్ని పండ్లు సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి. అలాంటి పండ్లను మాత్రం వదిలిపెట్టకుండా తింటే ఎన్నో ఉపయోగాలున్నాయి. ఈ వర్షాకాలంలో వినాయక చవితి నుండి విరివిగా లభించే ఈ సీతాఫలం ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అందుకే దీనిని విటమిన్లు, ఖనిజాలు కలిగిన పోషకాల ఘని అంటారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి పుష్కలంగా ఉంటాయి. సీతాఫలం అల్సర్లను నయం చేయడంలోనూ, అసిడిటీని నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే సూక్ష్మపోషకాలు మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

ఇది కంటి చూపును, జుట్టుని, మెదడు పనితీరు మెరుగుపర్చడంలో ఉపయోగపడుతుంది. సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి, హిమోగ్లోబిన్ మెరుగుపరిచి రక్తహీనతను నివారించగలదు. సీతాఫలంలోని బయోయాక్టివ్ అణువులు, యాంటీ ఒబెసియోజెనిక్, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. సీతాఫలం గ్లైసెమిక్ ఇండెక్స్ 54, అంటే లో-గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా సీతాఫలం తినవచ్చు.

సీతాఫలంలో ఫైబర్‌..

సీతాఫలంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషధంగా ఉంటుంది. కాకపొతే, ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది కనుక మోతాదుకి మించి సీతాఫలాలు తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక క్యాలరీలు కలిగిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గడేమో కానీ మళ్లీ అధిక బరువు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. ఇక ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని అరికడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది.

ఇవీ కూడా చదవండి:

Praising Children: పిల్లలను అతిగా ప్రశంసిస్తున్నారా..? అయితే జాగ్రత్త.. తాజా పరిశోధనలో కీలక విషయాలు..!

Vaccine: ఏయే వ్యాధులకు ఇంకా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాలేదు.. ఎంతో మంది మరణిస్తున్నా.. తయారు కానీ టీకాలు!

Women Health Tips: మహిళలు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే ఆ సమస్యలు దూరం..!

Blood Sugar Levels: చెమటతో రక్తంలో షుగర్‌ లెవల్స్‌ గుర్తింపు.. కొత్త డివైజ్‌ను తయారు చేసిన అమెరికా పరిశోధకులు..!

Acidity Prevention Tips: మీరు ఎసిడిటితో బాధపడుతున్నారా..? ఇలాంటి చిట్కాలు పాటించినట్లయితే ఎంతో ప్రయోజనం..!