Healthy Tips: కోవిడ్ 19, ఎలర్జీ మధ్య తేడాలివే.? కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవే..

|

Jun 16, 2021 | 7:24 PM

కరోనా వైరస్.. మన జీవితాలను పూర్తిగా మార్చేసింది. కోవిడ్ మహమ్మారి శారీరక, మానసిక ఆరోగ్యం పై మరింత అవగాహాన కల్పించింది.

Healthy Tips: కోవిడ్ 19, ఎలర్జీ మధ్య తేడాలివే.? కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవే..
Corona Sympotms
Follow us on

కరోనా వైరస్.. మన జీవితాలను పూర్తిగా మార్చేసింది. కోవిడ్ మహమ్మారి శారీరక, మానసిక ఆరోగ్యం పై మరింత అవగాహాన కల్పించింది. ఆరోగ్యకరమైన జీవనం కోసం మనుషులలో పలు మార్పులు తీసుకువచ్చిందనడంలో సందేహం లేదు. అయితే ఆరోగ్య విషయంలో మరిన్ని సందేహాలను రేకెత్తించింది. కరోనా వైరస్ లక్షణాల విషయంలో ఇప్పటికీ పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదు. అలాగే మరికొందరిలో ఇతర లక్షణాలు ఉన్నా కూడా పాజిటివ్ రావడం కొంత ఆందోళన కలిగిస్తోంది. అలాగే అలెర్జీ, ఫ్లూ వంటి సమస్యలు కూడ కరోనా లక్షణాలేనా అనే సందేహాం చాలా మందిలో వ్యక్తమవుతుంది. కరోనాకు, అలెర్జీలకు మధ్య వ్యత్యాసం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కరోనా..
కరోనా సోకిన వ్యక్తిలో ఎక్కువగా ప్రభావం అయ్యేది శ్వాస వ్యవస్థ. ఇది అంటువ్యాధి.. గాలి, శారీరక సంబంధాల ద్వారా వ్యాపిస్తుంది.

అలెర్జీలు..

అలెర్జీ అనేది రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపే ప్రతి చర్యగా పనిచేస్తుంది. దీనిని హై ఫీవర్ అంటారు. వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు పదార్థాల వలన అలెర్జీ కలుగుతుంది. ఇది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపించదు. దుమ్ము, వాతావరణంలో మార్పుల వలన కూడా అలెర్జీ సమస్య వస్తుంది.

కరోనా లక్షణాలు..

అలసట, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం.. జ్వరం, వాసన కోల్పోవడం, రుచి తెలియకపోవడం వంటివి కరోనా లక్షణాలు.

అలెర్జీ లక్షణాలు..

ముక్కు కారటం.. తుమ్ములు రావడం.. చర్మం పై దురద.. ముక్కు, కళ్లు ఉబ్బడం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. గొంతువాపు రావడం.

కరోనా నివారణ చిట్కాలు..

1. ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి..
2. బయటి నుంచి వచ్చిన వెంటనే కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి..
3. రోజుకు ఒకసారి ఆవిరిని పీల్చడం మంచిది. అలాగే జలుబు, దగ్గు సమస్యలు ఉంటే.. రోజుకు రెండు సార్లు ఆవిరి తీసుకోవాలి.

అలెర్జీ నివారణ చర్యలు..

1. అలెర్జీ కలిగించే ఆహారాన్ని తీసుకోకూడదు.
2. అలెర్జీ కోసం ఎలాంటి మందులు తీసుకోకూడదు. ఎప్పుడూ వైద్యులను సంప్రదించాలి.
3. ఎండాకాలంలో దుమ్ము, ధూళి ఎక్కువగా ఉంటుంది. అలెర్జీ ఉన్నవారు ఈ సమయంలో డాక్టర్స్ ఇచ్చిన మందులను వాడాలి.
4. ఆరోగ్యంగా తినడం.. వ్యాయామం చేయడంతోపాటు.. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ముఖ్యం.

Also Read:Rythu Bandhu: తెలంగాణ రైతుల ఖాతాల్లోకి అమౌంట్.. ‘రైతు బంధు’ డబ్బు వచ్చిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే..