Summer Cool Water Effects: రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండలకి బయటికి రావాలంటేనే జనాలు జంకుతున్నారు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఏప్రిల్ మే నెలల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. అయితే, ఈ ఎండలకు తాళలేక జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా జనాలు సహజంగానే చల్లదనాన్ని కోరుకుంటారు. బయటకు వెళ్తే చెట్ల నీడ వెదుక్కోవడం, కూల్ డ్రింక్స్, చల్లని నీటిని తాగుతుంటారు. వేసవిలో బయటి వెళ్లి ఇంటికి వచ్చిన వారు నేరుగా ఫ్రిడ్జ్ వద్దకు వెళ్లి.. కూల్ వాటర్ తీసుకుని తాగేస్తుంటారు. చల్లని నీటితో కాస్త ఉపశమనం పొందుతారు. అయితే, ఈ కూల్ వాటర్ తాగడం వల్ల తాత్కాలిక ఉపశమనం మాట అటుంచితే.. పెను ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. కూల్ వాటర్ తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. మరి ఆ ఆరోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణక్రియపై ప్రభావం..
కూల్ వాటర్ తాగడం వల్ల ప్రధానంగా జీర్ణ వ్యవస్థ ప్రభావితం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆహారం తినే ముందు చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుందని, తద్వారా అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయట.
శ్వేదరంద్రాలు మూసుకుపోతాయి..
చాలా మంది బయటి నుంచి ఇంటికి వచ్చాక ఫ్రిడ్జ్‌లోని కూల్ వాటర్‌తో ముఖం కడుక్కుంటారు. అయితే, ఇలా చేయడం మరింత ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. చన్నీటితో ముఖాన్ని కడిగితే.. చర్మంపై ఉండే శ్వేద రంద్రాలు మూసుకుపోతాయి. తద్వారా శరీరంలోని వ్యర్థాలు బయటకు రాకుండా.. మొటిమలు, నల్లటి మచ్చలకు కారణం అవుతుంది. అందుకే గోరు వెచ్చని నీరు గానీ, సాధారణ నీటితో గానీ ముఖం కడుక్కోవాలని సూచిస్తున్నారు.
హృదయ స్పందన రేటు తగ్గుతుంది..
వేసవిలో కూల్ వాటర్ తాగడం వల్ల హార్ట్ బీటింగ్ రేట్ తగ్గిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శరీరం అసంకల్పిత విధులను నియంత్రించే నాడిని ప్రేరేపిస్తుందట. కూల్ వాటర్ తాగడం వల్ల దాని ప్రభావం నాడీ వ్యవస్థపై పడి చురుకుదనం తగ్గుతుంది. దీని వలన హృదయ స్పందన రేటు తగ్గిపోతుందట.
తలనొప్పి వస్తుంది..
కూల్ వాటర్ తాగడం వల్ల వెన్నెముకలోని సెన్సిటీవ్ నరాలు ప్రభావితమవుతాయని, తద్వారా తలనొప్పి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖం, కపాల కండరాలు జివ్వుమని లాగి.. తీవ్రమైన నొప్పి వస్తుంది.
మలబద్ధకం..
ఆహారం తినే ముందు గానీ, తింటున్న సమయంలో గానీ, తిన్న తరువాత గానీ కూల్ వాటర్ తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు. జీర్ణ వ్యవస్థ ప్రభావితమవుతుందన్నారు. ఫలితంగా మలబద్ధకం సమస్య వస్తుందన్నారు. అందుకే ఆహారం తీసుకునే 30 నిమిషాల ముందు గానీ, 30 నిమిషాల తరువాత గానీ నీళ్లు తాగాలని, తినే సమయంలో వాటర్ తాగొద్దని సూచించారు.
బరువు పెరుగుతారు..
కూల్ వాటర్ తాగడం వల్ల బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. కూల్ వాటర్ తాగడం వల్ల శరీరంలో కేలరీలు చాలా నెమ్మదిగా బర్న్ అవుతాయని, ఇది శరీర బరువు పెరగడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. కూల్ వాటర్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపడం కూడా అధిక బరువుకు కారణం అవుతుందన్నారు.
(గమనిక: ఆరోగ్య నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం పైన వివరాలు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు నిర్ధారించలేదు. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే నిపుణల సలహాలు తీసుకోవడం ఉత్తమం.)
Also read:
SRH vs RR – IPL 2022: సన్‌రైజర్స్‌కు షాక్.. 61 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం..
Andhra Pradesh: ‘అవును నేను రౌడీనే’.. సంచలన కామెంట్స్ చేసిన పరిటాల శ్రీరామ్..
Big News Big Debate: 40 ఏళ్ల తెలుగుదేశం.. భవిష్యత్తుకు ఏది అభయం.. ప్రత్యేక కథనం..!