ప్రతి ఒక్కరిలో ఆహార అలవాట్లు వివిధ ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా మనం తీసుకున్న ఆహారం జీర్ణం చేసే పేగులు ముందుగా దెబ్బతింటాయి. ప్రస్తుతం ఎక్కువగా తీసుకునే స్పైసీ ఫుడ్, రిఫైన్డ్ షుగర్‌తో చేసిన ఆహారం, అలాగే రెడ్ మీట్ అంటే మేక మాంసం వంటి వాటి వల్ల కొలొరెక్టర్ క్యాన్సర్ ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. పెద్ద పేగు క్యాన్సర్ అంటే కొలొరెక్టల్ క్యాన్సర్ భారతీయుల్లో చాలా సాధారణంగా వస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డేటాను విశ్లేషిస్తే అర్థం అవుతుంది. పైగా క్యాన్సర్ దృష్టాంతం పశ్చిమ దేశాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది కేవలం జన్యుపరమైన తేడాల వల్లే ఇతర దేశాలతో కంటే భిన్నంగా ఉంటుందని అర్థం అవుతుంది. ఆహారం కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని ప్రభావితం చేస్తుంది. 2003-2005 మధ్య నిర్వహించిన ఒక అధ్యయనంలో రెడ్ మీట్, రిఫైన్డ్ షుగర్ మరియు స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది. అంతర్జాతీయ అధ్యయనాలు కూడా ఇలాంటి ఫలితాలనే పేర్కొన్నాయి. ప్రాసెస్ చేసిన మాంసం క్యాన్సర్ కారకాలుగా ఉంటాయి. అలాగే ఆహార పదార్థాల రుచిని మెరుగుపరచడానికి పెద్ద మొత్తంలో చక్కెరను ఉపయోగించడ వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఈ క్యాన్సర్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పెద్ద పేగు క్యాన్సర్‌లా కాకుండా కొలొరెక్టల్ క్యాన్సర్ చికిత్సకు ప్రత్యేక ప్రణాళిక అవసరం. శస్త్రచికిత్సకు ముందు రేడియేషన్ థెరపీ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే నిరంతర స్టోమా సమస్యను సింపుల్‌గా నివారించవచ్చు. ఇలా చేస్తే 75 శాతం కంటే ఎక్కువ మంది రోగుల్లో స్టోమా నివారించవచ్చు. కొలొరెక్టల్ క్యాన్సర్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి అని వాపొ బారిన పడిన వారి జీవితాలపై వినాశకరమైన ప్రభావాలను కలిగిస్తుందని పేర్కొంటున్నారు. పెద్ద పేగు లేదా పురీషనాళంలో అభివృద్ధి చెందే ఒక రకమైన క్యాన్సర్. దీన్ని ఇది సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. ముఖ్యంగా తగిన ఆహార అలవాట్లను పాటిస్తే ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానం, అధిక మద్యపానం వంటి అనారోగ్యకరమైన అలవాట్లను నివారించడం ద్వారా ఈ క్యాన్సర్ ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే కొలొరెక్టల్ క్యాన్సర్‌ను గుర్తించడం చాలా కష్టం అని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారం జీర్ణం అవ్వడంలో సమస్యలను గుర్తిస్తే కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు. పేగు కదలికలతో రక్తస్రావం, మలబద్ధకం, బరువు తగ్గడం, రక్తహీనత వంటి లక్షణాలున్నా వైద్యులను సంప్రదించాలి. ప్రారంభంలోనే వ్యాధిని గుర్తిస్తే సాధారణ కొలొనోస్కోపీని నిర్వహించడం ద్వారా, మనం పాలిప్స్‌ని తొలగించి, కొలొరెక్టల్ క్యాన్సర్‌ను అభివృద్ధి చేయకుండా నిరోధించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మినిమల్లీ ఇన్వాసివ్ ల్యాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జరీ టెక్నిక్ వల్ల రోగులను త్వరగా డిశ్చార్జ్ చేయడం సాధ్యపడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి