Cool Winds: చల్లటి గాలులతో ఆరోగ్య సమస్యలు.. ఎలా అధికమించాలంటే..

|

Jan 21, 2022 | 3:33 PM

చలికాలం చల్లటి గాలులు రావడంతో చాలా మంది ఇబ్బంది పడతారు. వాతావరణంలో ఈ మార్పులు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి.

Cool Winds: చల్లటి గాలులతో ఆరోగ్య సమస్యలు.. ఎలా అధికమించాలంటే..
Follow us on

చలికాలం చల్లటి గాలులు రావడంతో చాలా మంది ఇబ్బంది పడతారు. వాతావరణంలో ఈ మార్పులు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ సమయంలో అందరు జాగ్రత్తగా ఉండాలి. చల్లటి గాలులతో ఎలాంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయో తెలుసుకుందాం..
1. ఎముకలు, కీళ్లు, కండరాల నొప్పి
చలికాలంలో పొగమంచు, మేఘాల కారణంగా చాలా రోజులు సూర్యరశ్మి ఉండదు. ఎక్కువ కాలం సూర్యకాంతి లేనప్పుడు, శరీరంలో విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. తేమ, ఉష్ణోగ్రత కారణంగా, ఎముకలు, కీళ్లు, కండరాలు నొప్పి వస్తుంది.
2. దగ్గు, జలుబు తీవ్రతరం
వాతావరణం మారినప్పుడల్లా, దాదాపు ప్రతి ఒక్కరికీ జలుబు, దగ్గు సమస్య ఉంటుంది. అటువంటి పరిస్థితిలో బయటకు వెళ్లే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
3. బ్రోన్కైటిస్, శ్వాసకోశ వ్యాధులు ఉండటం
చల్లని గాలి, తేమకు గురికావడం వల్ల బ్రోన్కైటిస్ వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వస్తాయి. జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని అధిగమించడానికి వేడినీరు తాగాలి.
4. రక్తపోటు
ఈ చల్లని కాలంలో ఉష్ణోగ్రతతో పాటు వాతావరణ పీడనం తగ్గుతుంది. ఇది తరచుగా రక్తపోటు లేదా అధిక రక్తపోటుకు కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో వెల్లుల్లి, అరటి, సిట్రస్ పండ్లు, తేనెను తీసుకోవాలి.
5. చర్మ సమస్యలు
ఉష్ణోగ్రత లేకపోవడం, చల్లని గాలుల ప్రభావం కారణంగా, మన చర్మం కూడా ప్రభావితమవుతుంది. దీని వల్ల అలర్జీలు, ఎర్రటి మచ్చలు, పెదవులు పగిలిపోవడం, చర్మ సమస్యలు వస్తాయి.

Read Also.. Weight Loss Diet: ఆకుకూరలతో వేగంగా బరువు తగ్గొచ్చు తెలుసా..? అవేంటంటే..