Cold Water Side Effects: ఎండాకాలంలో అదేపనిగా చల్లని నీరు తాగుతున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

|

May 10, 2022 | 10:07 AM

చల్లటి నీరు మీ దాహాన్ని తీర్చినప్పటికీ.. అది ఎంత హానికరమో అన్న విషయం మీకు తెలుసా..?

Cold Water Side Effects: ఎండాకాలంలో అదేపనిగా చల్లని నీరు తాగుతున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
Water
Follow us on

Side Effects Of Cold Water: వేసవి కాలంలో ఎంత నీరు తాగినా దాహం తీరదు. ఈ క్రమంలో చాలామంది దాహం తీర్చుకునేందుకు.. చల్లటి నీరు, శీతల పానీయాలు.. అనేక రకాల కూల్ జ్యూస్ లు తీసుకుంటుంటారు. కానీ చల్లటి నీరు మీ దాహాన్ని తీర్చినప్పటికీ.. అది ఎంత హానికరమో అన్న విషయం మీకు తెలుసా..? వాస్తవానికి ఈ విషయం చాలామందికి తెలియదు.. ఒకవేళ తెలిసినా ఏం కాదులే అంటూ తేలికగా తీసుకుంటారు. అయితే.. చల్లని నీరు లేదా శీతల పానీయాలు తీసుకోవడం వల్ల కలిగే కొన్ని అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తవానికి, ఫ్రిజ్‌లో ఉంచిన నీరు తాగడం వల్ల శరీరం సహజంగా చల్లబడదు.. దీంతోపాటు శరీరం క్రమంగా అనాగరోగ్యానికి గురవుతుంటుంది.

కూల్ వాటర్ తాగడం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలు.. 

  • ఊబకాయం: చల్లటి నీరు మీ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును మరింత పెంచతుంది. దీని కారణంగా ఊబకాయం ఇంకా పెరుగుతుంది. బరువు తగ్గడంలో సమస్య రావడానికి ఇదే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల, బరువు తగ్గే సమయంలో గోరువెచ్చని నీటిని తాగడం మంచిది.
  • మలబద్ధకం:చల్లటి నీరు తాగడం వల్ల మన పేగులు ముడుచుకుపోతాయి. అందుకే జీర్ణక్రియ ప్రక్రియ సరిగా జరగదు. ప్రేగు ప్రక్రియ సరిగ్గా జరగకపోతే.. మలబద్ధకం, అజీర్తి లాంటివి వస్తాయి.
  • గొంతు నొప్పి: చల్లటి నీరు తాగటం వల్ల గొంతు సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. కాబట్టి బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు చల్లని నీటికి దూరంగా ఉండండి.
  • తలనొప్పి: తలనొప్పి సమస్య ఎక్కువగా ఉన్నవారు చల్లటి నీటిని తాగడం వల్ల మెదడు స్తంభించిపోయే ప్రమాదం పెరుగుతుంది. చల్లని నీరు వెన్నెముక సున్నితమైన నరాలను చల్లబరుస్తుంది.. ఇది మెదడుపై ప్రభావం చూపి తలనొప్పికి దారితీస్తుంది.

ఇలా చేయండి..

వేసవిలో.. చల్లని నీరు తాగడానికి బదులుగా.. గది ఉష్ణోగ్రత లేదా నీటి కుండలో ఉంచిన నీటిని తాగాలి. దీనివల్ల మీ దాహం కూడా తీరుతుంది. ఎటువంటి హాని కూడా జరగదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Fruits for Arthritis: కీళ్ల నొప్పులతో అల్లాడుతున్నారా..? అయితే మూడు పండ్లను తప్పనిసరిగా తినండి..

Muskmelon Benefits: వేసవిలో కర్బూజను తింటున్నారా..? అయితే.. ఈ విషయాలపై లుక్కేయాల్సిందే..