Cold Water Side Effects: చల్లటి నీరు తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!

|

Apr 16, 2022 | 9:23 AM

Cold Water Side Effects: ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్‌ ఉంటుంది. దీని వల్ల తినేవాటిని, తాగే వాటిని స్టోర్‌ చేసుకొని మరీ ఉపయోగిస్తున్నారు. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Cold Water Side Effects: చల్లటి నీరు తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!
water
Follow us on

Cold Water Side Effects: ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్‌ ఉంటుంది. దీని వల్ల తినేవాటిని, తాగే వాటిని స్టోర్‌ చేసుకొని మరీ ఉపయోగిస్తున్నారు. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక వేసవిలో చాలామంది చల్లటి నీరుతాగడానిక అలవాటు పడుతారు. అంతేకాదు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ చల్లటి నీటిని తాగే వారు కూడా ఉన్నారు. ఎక్కువగా కూల్ వాటర్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల జలుబు, దగ్గు మాత్రమే కలుగుతుంది అనుకుంటే తప్పు. అది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతోంది. అదే పనిగా మనం చల్లటి నీరు తాగినట్లయితే ఆహారం జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. దీని కారణంగా కడుపు నొప్పి , వికారం, మలబద్దకం , లాంటి సమస్యలు సంభవిస్తాయి. సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. అయితే చల్లటి నీటిని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత అస్థిరతకు గురవుతుంది. ఇది జీర్ణక్రియపైనా ప్రభావం చూపిస్తుంది. ఆహారం సమయంలో చల్లటి నీటిని తాగడం వల్ల శరీరం ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించేందుకు అధిక శక్తిని తీసుకుంటుంది. అందుకే ఆహారం తీసుకునే సమయంలో చల్లటి నీటికి దూరంగా ఉండాలి. చల్లటి నీటిని తాగడం వల్ల మ్యూకోసా ఏర్పడి, గొంతు నొప్పి, ముక్కు కారే సమస్యలు కూడా ఎదురవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

మైగ్రేయిన్ నొప్పి ఉన్న వారు చల్లటి నీటిని తీసుకుంటే అది ఇంకా పెరుగుతుందని 2001లో నిర్వహించిన ఒక అధ్యయనంలో గుర్తించారు. చైనా సంస్కృతిని గమనించినా ఆహారంతో పాటు గోరువెచ్చని నీరు, వేడి టీ సరఫరా చేస్తుంటారు. వ్యాయామం తర్వాత చల్లని నీరు తాగకూడదు. ఎండ కాలంలో వ్యాయమం తర్వాత చల్లని నీరు తాగకూడదు. ఎందుకంటే బాడీలో మరింత వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఇది దీర్ఘకాలిక కడుపు నొప్పికి దారితీస్తుంది.
గోరు వెచ్చని నీటిని ఆహారానికి ముందు తీసుకోవడం వల్ల బరువు తగ్గేందుకు సాయపడుతుందని పరిశోధకులు పలు అధ్యయనాల్లో గుర్తించారు. అంతేకాదు రక్త ప్రసరణకు, జీర్ణక్రియలకు, టాక్సిన్లు బయటకు వెళ్లేందుకు గోరు వెచ్చని నీరు సాయపడుతుంది. కూల్ వాటర్ అధికంగా తాగటం వల్ల మెదడుకు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. చల్లటి నీరు మెదడు పై ప్రభావం చూపుతుంది. దీని వల్ల తల నొప్పి, సైనస్ సమస్యలు వస్తాయి.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Peanuts Side Effects: ఈ ఆరోగ్య సమస్యలున్నవారు వేరుశెనగ తింటున్నారా.. అయితే ప్రమాదమే..!

Taj Mahal: తాజ్‌మహల్‌ ప్రేమకి చిహ్నం.. దేశంలో చాలా కట్టడాలు ప్రేమతో ముడిపడి ఉన్నాయి..!

High Blood Pressure: అధిక రక్తపోటుకి ఇవే ముఖ్య కారణాలు.. అదుపులో లేకుంటే అంతే సంగతులు..!