American Heart Association – coffee caffeine: కాఫీ ప్రియులకు నిజంగా శుభవార్తే.. ఎందుకంటే రోజూ కాఫీ తాగితే గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చని అధ్యయానాలు పేర్కొంటున్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇటీవల చేసిన అధ్యయనంలో కెఫిన్ కాఫీని తాగితే గుండె జబ్బుల నుంచి ఉపశమనం పొందవచ్చని తేలింది. చక్కెర కలపని బ్లాక్ కాఫీ (కెఫిన్) ని తాగితే గుండె పనితీరు చక్కగా ఉంటుందని, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలను కూడా ఇది బాగా అరికడుతుందని అధ్యయనంలో తేలింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన మూడు సుదీర్ఘ అధ్యయనాల్లో కాఫీకి, గుండె పనితీరుకు ఉన్న లింక్ స్పష్టంగా తేలినట్లు ప్రొఫెసర్లు వెల్లడించారు. రోజూ ఒక కప్పు లేదా అంతకంటే ఎక్కువ సార్లు బ్లాక్ కాఫీ తాగిన వారిలో గుండె జబ్బులు 30శాతం మేర తగ్గినట్టు అధ్యయనం వెల్లడిచింది.
కానీ పాలు, చక్కెర, క్రీమ్ లాంటివి వేసి రోజూ కాఫీ తాగిన వారిలో మాత్రం గుండె జబ్బులు యథావిధిగా కనిపించాయని.. కెఫిన్ తీసుకోవడం వల్ల అధ్బుతమైన ఫలితం ఏర్పడినట్లు అధ్యయనంలో వెల్లడించారు. ఇది పరిశోధకులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోందని చికాగోలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. అందుకు రోజూ కాఫీని తాగాలని సూచిస్తున్నారు. కాఫీని చాలామంది ఇష్టపడుతుంటారు. కాఫీలోని కెఫిన్ రసాయనం క్షణాల్లోనే ఉత్తేజితుల్ని చేసి, కాస్త బలాన్ని కూడా ఇస్తుంది. అందుకే చాలా మంది కాఫీతోనే రోజును ప్రారంభిస్తారు.
Also Read: