Precautions for Laptop Cleaning: ల్యాప్ టాప్ ను క్లీన్ చేస్తున్నారా? ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి!!

|

Aug 27, 2023 | 9:18 PM

వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక.. ఉద్యోగాలు చేసేవారంతా దాదాపు ల్యాప్ టాప్ లనే వాడుతున్నారు. ఉద్యోగులే కాదు.. విద్యార్థులు కూడా ఆన్ లైన్ క్లాసుల కోసం ల్యాప్ టాప్ లు వాడక తప్పని పరిస్థితులు వచ్చాయి. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు వాడేటప్పుడు.. వాటి పరిశుభ్రత చాలా ముఖ్యం. అది మొబైల్, ల్యాప్ టాప్, టీవీ ఏదైనా కావొచ్చు. ల్యాప్ టాప్ క్లీనింగ్ విషయానికొస్తే.. దీనిని శుభ్రం చేసేటపుడు కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా..

Precautions for Laptop Cleaning: ల్యాప్ టాప్ ను క్లీన్ చేస్తున్నారా? ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి!!
Laptop Cleaning
Follow us on

వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక.. ఉద్యోగాలు చేసేవారంతా దాదాపు ల్యాప్ టాప్ లనే వాడుతున్నారు. ఉద్యోగులే కాదు.. విద్యార్థులు కూడా ఆన్ లైన్ క్లాసుల కోసం ల్యాప్ టాప్ లు వాడక తప్పని పరిస్థితులు వచ్చాయి. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు వాడేటప్పుడు.. వాటి పరిశుభ్రత చాలా ముఖ్యం. అది మొబైల్, ల్యాప్ టాప్, టీవీ ఏదైనా కావొచ్చు. ల్యాప్ టాప్ క్లీనింగ్ విషయానికొస్తే.. దీనిని శుభ్రం చేసేటపుడు కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి.

తడి క్లాత్ తో తుడవకూడదు: ప్లగ్ ఇన్ చేసి ఉండగా.. తడి క్లాత్ తో ల్యాప్ టాప్ ను క్లీన్ చేస్తే కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంది. అందుకే.. ల్యాప్ టాప్ ను శుభ్రం చేసేముందు దానిని పూర్తిగా ఆఫ్ చేసి.. పవర్ సోర్స్ నుంచి అన్ ప్లగ్ చేయాలి. ఇలా చేస్తే.. విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉండదు.

మైక్రో ఫైబర్ క్లాత్ వాడాలి: ల్యాప్ టాప్ వెలుపలు శుభ్రం చేసేందుకు మైక్రోఫైబర్ వస్త్రాన్ని వాడండి. ఇది దుమ్ము, ఫింగర్ ప్రింట్స్ స్మడ్జ్ లను సున్నితంగా తొలగించడంలో ఉపయోగంగా ఉంటుంది. స్క్రీన్ పై బలంగా తుడిస్తే.. పగుళ్లు రావొచ్చు.

ఇవి కూడా చదవండి

మృదువైన బ్రష్ వాడాలి: ల్యాప్ టాప్ కీ ప్యాడ్, టచ్ ప్యాడ్ ల మధ్య పేరుకున్న చెత్త, ధూళిని తొలగించేందుకు మృదువైన బ్రష్ లేదా.. ప్రెజర్ తో ఉన్న గాలిని ఉపయోగించండి.

కంప్రెస్డ్ ఎయిర్: ల్యాప్ టాప్ వెంట్స్, పోర్ట్ లలో ఉన్న దుమ్మును క్లీన్ చేసేందుకు కంప్రెస్డ్ ఎయిర్ ను వాడాలి. డివైస్ లోకి దుమ్ముపోకుండా మరోవైపు పట్టుకుని శుభ్రం చేయాలి.

పదునైన వస్తువుతో క్లీన్ చేయకూడదు: ల్యాప్ టాప్ ఛార్జింగ్ పోర్ట్ లో పదునైన వస్తువుతో క్లీన్ చేయరాదు. అలా చేస్తే.. లోపలి భాగాలు దెబ్బతిని.. ఛార్జింగ్ పోర్ట్ పాడయ్యే అవకాశం ఉంది.

కీబోర్డ్ శుభ్రత ముఖ్య: కీబోర్డ్ శుభ్రత చాలా అవసరం. ల్యాప్ టాప్ కీ బోర్డ్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ల్యాప్ టాప్ ఒకవైపుకి వంచి.. గట్టిగా గాలిని ఊదితే వాటిలో ఉన్న ధూళి బయటకు పోతుంది. కీబోర్డ్ ను శుభ్రం చేసేందుకు ఎలాంటి ద్రవాన్ని వాడకూడదు. అది కీ ల మధ్యలో చేరి వాటి పనితీరును దెబ్బతీయవచ్చు.

ప్రొఫెషనల్స్ కి చూపించండి: ల్యాప్ టాప్ లోపలి భాగాల్లో దుమ్ము, ధూళి చేరి ఉంటాయన్న అనుమానం ఉంటే.. మీ ల్యాప్ టాప్ ను ప్రొఫెషనల్ క్లీనర్ కు చూపించడం మంచిది. మీరే స్వయంగా ఓపెన్ చేసి క్లీన్ చేయడం రిస్క్ తో కూడిన పని.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి