తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. పిల్లల్లో డయాబెటిస్.. ఇలా చేశారంటే షుగర్ బలాదూరే..

ఈ రోజుల్లో చిన్న పిల్లలలో కూడా డయాబెటిస్ సమస్య పెరుగుతోంది. గతంలో ఈ వ్యాధి ఎక్కువగా పెద్దలలో కనిపించేది, కానీ ఇప్పుడు దాని ప్రభావం పిల్లలలో కూడా కనిపిస్తోంది. తల్లిదండ్రులు కొన్ని ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహిస్తే దీనిని మొదట్లోనే నివారించవచ్చని.. పిల్లలకు మంచి భవిష్యత్తును అందించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. పిల్లల్లో డయాబెటిస్.. ఇలా చేశారంటే షుగర్ బలాదూరే..
Diabetes In Children

Updated on: Feb 23, 2025 | 4:42 PM

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.. ఒకప్పుడు పెద్దలలో, వృద్ధులలో కనిపించే మధుమేహం (డయాబెటిస్) వ్యాధి.. ఇప్పుడు యువత, చిన్న పిల్లలను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని పిల్లలలో ఈ వ్యాధి వేగంగా పెరుగుతోందని.. ఇది ఆందోళన కలిగించే అంశమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడే తమ జీవితాన్ని ప్రారంభించే పిల్లలు. చిన్న వయస్సులోనే ఇటువంటి వ్యాధులకు గురికావడం వలన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. చిన్న వయస్సులోనే మధుమేహం అభివృద్ధి చెందడం వల్ల ఊబకాయం, మూత్రపిండాలు, కాలేయ సమస్యలు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో, పిల్లలలో పెరుగుతున్న మధుమేహ కేసుల గురించి తల్లిదండ్రులందరికీ సరైన అవగాహన ఉండాలి.. అప్పుడే ఈ వ్యాధికి కళ్లెం వేయొచ్చు..

ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు.. మధుమేహం కారణాలు, లక్షణాలు.. పలు విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంంతైనా ఉంది.. ఆ తర్వాత మాత్రమే తల్లిదండ్రులు తమ పిల్లలను డయాబెటిస్ వ్యాధి నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవచ్చు.. వారిని ఆరోగ్యంగా చూసుకోవచ్చు.. పిల్లలకు ఎలాంటి పరిస్థితుల్లో డయాబెటిస్ వస్తుంది..? కారణాలు, లక్షణాలను తెలుసుకోండి..

జంక్ ఫుడ్ – స్వీట్లు ఎక్కువగా తినే అలవాటు..

పిల్లలు ఇప్పుడు ఆరోగ్యకరమైన.. ఇంట్లో వండిన ఆహారాన్ని తినేందుకు ఇష్టపడటం లేదు.. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పిజ్జా, బర్గర్, చిప్స్, చాక్లెట్, శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లలో చాలా చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వు లాంటివి ఉంటాయి.. ఇవి శరీరంలోని ఇన్సులిన్‌ను క్రమంగా బలహీనపరుస్తుంది. దీని కారణంగా, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.. అంతేకాకుండా చిన్నారుల్లో డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది.

వ్యాయామం – ఆటలు లేకపోవడం

గతంలో పిల్లలు ఎక్కువగా బయట ఆడుకుంటూ, పరిగెత్తుకుంటూ ఉండేవారు.. కానీ ఇప్పుడు మొబైల్, టీవీ, వీడియో గేమ్‌లతో బిజీగా మారడం వల్ల శారీరక శ్రమ చాలా తగ్గిపోయింది. శరీరం సరిగ్గా చురుగ్గా లేనప్పుడు, కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.. దీంతో శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది.. ఇది మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.

ఊబకాయం..

పిల్లలు అధిక బరువుతో ఉంటే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు, ఇన్సులిన్ సరిగా పనిచేయదు.. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం వల్ల ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది.

కుటుంబంలో మధుమేహ చరిత్ర..

తల్లిదండ్రులలో లేదా తాతా, మామలలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే.. పిల్లలకు కూడా అది వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అయితే, అలాంటి ప్రతి బిడ్డకు డయాబెటిస్ వస్తుందని కూడా లేదు.. కానీ ఆహారం, జీవనశైలి సరిగ్గా లేకపోతే, వ్యాధి త్వరగా వచ్చే అవకాశం ఉంది.. కాబట్టి, ఇప్పటికే తమ కుటుంబంలో మధుమేహం ఉన్నవారు తమ పిల్లల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి.

ఒత్తిడి – తక్కువ నిద్ర..

పిల్లలపై చదువు ఒత్తిడి, అధిక స్క్రీన్ సమయం వల్ల నిద్ర లేకపోవడం, ఒత్తిడి కూడా మధుమేహానికి ప్రధాన కారణాలుగా మారవచ్చు. శరీరానికి విశ్రాంతి లభించనప్పుడు లేదా మనస్సు చాలా ఒత్తిడికి గురైనప్పుడు, హార్మోన్ల సమతుల్యత చెదిరిపోతుంది.. ఇది జీవక్రియను ప్రభావితం చేస్తుంది.. మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

డయాబెటిస్ నుంచి పిల్లలను రక్షించడానికి సులభమైన చిట్కాలు..

పిల్లలకు ఇంట్లో తయారుచేసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపించండి.. బయటి ఫాస్ట్ ఫుడ్ తినడం తగ్గించండి. రోజుకు కనీసం 1-2 గంటలపాటు ఆటలు లేదా శారీరక శ్రమను ప్రోత్సహించండి. వ్యాయామం చేయిస్తూ ఉండండి.. తీపి పదార్థాలు, శీతల పానీయాల అలవాటును క్రమంగా తగ్గించండి. వారి నిద్రను జాగ్రత్తగా చూసుకోండి.. ఇంకా పిల్లల ఫోన్, టీవీ స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి.

కుటుంబంలో మధుమేహం ఉంటే, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండండి. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటే, మధుమేహం వంటి వ్యాధుల నుంచి వారిని కాపాడుకోవచ్చు. కొంచెం శ్రద్ధ పెడితే.. దీని నుంచి బయటపడొచ్చు..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..