Sweet Potato: చిలకడదుంప.. తింటే ఉండదు చింత

చిలకడ దుంప చాలా మంచిది. పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ దీన్ని తినొచ్చు. ఇందులోని పీచు పదార్థం వల్ల.. ఉదర సమస్యలు దరిచేరవు. వీటీల్లోని పొటాషియం, మెగ్నీషియం బీపీని అదుపు చేస్తాయి. దీన్ని డైట్‌లో చేర్చుకుంటే ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు.

Sweet Potato: చిలకడదుంప.. తింటే ఉండదు చింత
Sweet Potato

Updated on: Jul 17, 2025 | 10:09 AM

చిలకడదుంపలు రుచికరమైనవే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలైనవి. ఇవి పోషక విలువలతో నిండి ఉండటంతో శరీరానికి ఎనర్జీతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా ఇస్తాయి. చిలకడదుంపల ముఖ్యమైన ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..

శక్తిని ఇస్తుంది: కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. వ్యాయామం చేసే వారి కోసం ఇది మంచి ఆహారం.

జీర్ణవ్యవస్థకు మేలు : చిలకడదుంపలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది.

మధుమేహ నియంత్రణలో సహకారం: చిలకడదుంపలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది.

విషపదార్థాల నివారణ : ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌కి విరుద్ధంగా పనిచేసి క్యాన్సర్‌ వంటి జబ్బులను నిరోధిస్తాడు.

మెరుగైన కళ్ల ఆరోగ్యం : చిలకడదుంపలో బీటా-కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది విటమిన్ Aగా మారి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

రక్తపోటు నివారణ: ఇందులో ఉన్న పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

చర్మం, జుట్టు ఆరోగ్యానికి తోడ్పాటు: విటమిన్ C, విటమిన్ E వంటి విటమిన్లు చర్మం మెరుస్తూ ఉండేందుకు, జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.

చిలకడదుంపలను మితంగా తీసుకోవడం ఉత్తమం. వాటిని ఆయిల్‌లో వేపితే పోషక విలువలు తగ్గిపోవచ్చు, కాబట్టి ఉడికించి లేదా స్టీమ్ చేసి తినడం మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)