అధిక బరువు.. నూటికి 80 శాతం మంది సమస్య ఇదే. బరువు పెరగడం ఈజీ కానీ.. తగ్గడం చాలా కష్టం. పెరిగిన బరువును తగ్గించుకునేందుకు చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల డైట్ లు, వ్యాయామాలు చేస్తుంటారు. ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. డైట్ లో కొవ్వును పెంచేవాటిని పక్కనపెట్టి.. ప్రొటీన్, ఫైబర్ శాతాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటున్నారు. మరి డైట్ లో శనగలు తినొచ్చా ? శనగలు బరువును తగ్గిస్తాయా ? పెంచుతాయా ? అనే అనుమానాలు మీకూ ఉన్నాయా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.
జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది: బరువు తగ్గాలనుకునేవారు శనగలను తినవచ్చు. వీటిని నానబెట్టి, ఉడకబెట్టి, మొలకెత్తినవి తినవచ్చు. శనగలలో ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బరువుని తగ్గించేందుకు సహకరిస్తాయి. ఫైబర్ జీర్ణశక్తిని మెరుగ్గా ఉంచుతుంది. శనగలు తింటే కడుపు నిండిన భావన కలిగి.. త్వరగా ఆకలివేయదు.
హెల్దీ స్నాక్: డైట్ లో శనగలను తిననివారికంటే.. తిన్నవారే త్వరగా బరువు తగ్గినట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. అరకప్పు శనగలలో 6 గ్రాముల ఫైబర్, 7 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. అందుకే దీనిని హెల్దీ స్నాక్ గా చెబుతారు.
నిద్రలేమి సమస్య ఉండదు: నిద్రలేమి సమస్య ఉన్నవారు రెగ్యులర్ గా శనగలను తింటే.. ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
గుండె సమస్యలు తగ్గుతాయి: శనగలలో ఉండే ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. అలాగే గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. వీటిలో ఉండే ఎమినో యాసిడ్స్, ట్రైప్టోఫాన్, సెరోటొనిన్ వంటి విటమిన్స్ మంచినిద్రను అందిస్తాయి.
కాల్షియం మెండుగా: కాల్షియం అనగానే.. ఠక్కున గుర్తొచ్చేవి పాలే కదా. కానీ శనగలలో కూడా పాలకు సమానమైన కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల శనగలలో 164 మి.గ్రా కెలరీలు, 8.9 గ్రాముల ప్రొటీన్, 2.5 గ్రాముల ఫ్యాట్, 8.6 గ్రాముల ఫైబర్, 2.8 గ్రాముల ఐరన్ ఉంటాయి.
పీచు పదార్థాలు: శనగలు, కాబూలీ శనగల్లో కొవ్వులు తక్కువగా.. పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. శాకాహారులు ప్రతిరోజూ శనగలు తింటే.. నాన్ వెజిటేరియన్స్ పొందే అన్నిరకాల పోషకాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీ డైట్ లో శనగలను ఎలాంటి అనుమానాలు లేకుండా తినవచ్చని సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి