చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా..? ఇది తలకు రాస్తే తగ్గిపోతుంది..!

ప్రస్తుత రోజుల్లో చాలా మందికి జుట్టు రాలిపోవడం పెద్ద సమస్యగా మారింది. జుట్టు పొడిగా ఉండటం, ఊడిపోవడం, తల మీద చర్మం గట్టిగా లేకపోవడం లాంటి ఇబ్బందులు చాలా మందికి కామన్ అయిపోయాయి. ఈ సమస్యలకు నాచురల్‌గా దొరికే వాటితో పరిష్కారం వెతుక్కుంటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా చియా గింజలు బాగా పని చేస్తాయి. వీటిలో ఉండే మంచి పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి.

చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా..? ఇది తలకు రాస్తే తగ్గిపోతుంది..!
Healthy Hair Tips

Updated on: May 18, 2025 | 4:39 PM

రెండు టీ స్పూన్ల చియా గింజలు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి 20 నిమిషాలు నానబెట్టాలి. ఈ గింజలు నీటిని పీల్చుకొని జెల్ లాగా తయారవుతాయి. ఈ జెల్‌ను తలకు రాసే ముందు ఒకసారి బాగా కలిపితే మంచిగా ఉంటుంది. నానబెట్టిన చియా జెల్‌ లో ఒక స్పూన్ నిమ్మకాయ రసం వేసి తలకు మెల్లగా రుద్దాలి. అలా చేసిన తర్వాత 30 నిమిషాలు ఆ మిశ్రమాన్ని తల మీద ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేస్తే తల మీద చుండ్రు తగ్గుతుంది. జుట్టు మెరుస్తూ తేలికగా ఉంటుంది.

నానబెట్టిన చియా జెల్‌ లో కొంచెం కొబ్బరి నూనె వేసి తలకు మసాజ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా తల మీద ఉంచి ఉదయాన్నే తక్కువ కెమికల్స్ ఉన్న షాంపూతో కడగాలి. దీనివల్ల జుట్టు ఒత్తుగా మారే అవకాశం ఉంది. తల చర్మానికి తేమ అందుతుంది. జుట్టు కుదుళ్లు బలపడుతాయి.

చియా జెల్‌ లో రెండు స్పూన్ల ఆలివ్ నూనె వేసి బాగా కలిపిన తర్వాత తలకు రాయాలి. వారానికి రెండు సార్లు ఈ మిశ్రమాన్ని వాడితే తల చర్మం ఆరోగ్యంగా మారుతుంది. రక్త ప్రసరణ బాగుంటుంది. జుట్టు పెరగడానికి మంచి వాతావరణం ఏర్పడుతుంది.

చియా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒంటికి చాలా మంచిది. రోజూ ఒక స్పూన్ చియా విత్తనాలను గోరువెచ్చని నీటిలో నానబెట్టి తింటే ఒంటికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ లాంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. ఇవి జుట్టు పెరగడానికి సహాయపడతాయి.

ఇక్కడ చెప్పిన రకాల మిశ్రమాలను వారంలో రెండు లేదా మూడు సార్లు వాడితే జుట్టు ఇంకా బలంగా మారుతుంది. తల చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు జుట్టు రాలడం తగ్గుతుంది. కెమికల్స్ ఉన్న కండీషనర్లు, క్రీమ్‌లు వాడటం తగ్గించడం వల్ల నాచురల్‌గా జుట్టు బాగుపడుతుంది.

చియా విత్తనాలు వాడటం వల్ల జుట్టు ఆరోగ్యం బాగుంటుంది. కానీ మనకున్న ఆరోగ్య సమస్యలను బట్టి ఏది వాడాలో ముందు తెలుసుకోవాలి. చర్మం సున్నితంగా ఉండే వాళ్ళు ఎవరైనా ముందు కొంచెం పరీక్ష చేసి వాడితే మంచిది. మొదట చేతి వెనుక లేదా చెవి కింద భాగంలో కొంచెం మిశ్రమాన్ని రాసి కొంత సమయం వరకు గమనించండి. ఎరుపు, దురద, మంట లాంటి అలర్జీ లక్షణాలు ఏవి కనిపించినా వాడకూడదు.