Taro Root Health Benefits: చామదుంపలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలిస్తే అసలు వదిలిపెట్టరు..

|

Feb 19, 2021 | 8:12 PM

సాధారణంగా మన వంటింట్లో చామ దుంపలతో కూర, ఫ్రై ఇలా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం. అయితే చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు.

Taro Root Health Benefits: చామదుంపలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
Follow us on

సాధారణంగా మన వంటింట్లో చామ దుంపలతో కూర, ఫ్రై ఇలా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం. అయితే చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ వీటిలో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవెంటో తెలుసుకుందామా ?

మాములుగా మన వంటింట్లో వాడే చామ దుంపల వలన బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిలో న్యూట్రీషియన్స్ సమృద్ధిగా ఉంటాయి. చామ దుంపలలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది మధుమేహాన్ని నియంత్రిస్తుంది. డయాబెటిస్ పేషెంట్లు చామ దుంపలని తీసుకోవడం వల్ల డైటరీ ఫైబర్ డైజేషన్ ప్రాసెస్‏ని మెరుగు చేస్తుంది. దీని మూలంగా శరీరంలో ఇన్సులిన్ విడుదలను రెగ్యులేట్ చేయగలుగుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‏ను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఐరన్ కూడా లభిస్తుంది. రక్తం పెరుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఎనిమియా సమస్యతో బాధ పడే వాళ్ళకి చామదుంప బాగా సహాయం చేస్తుంది. పైగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇది బాగా మెరుగుపరుస్తుంది. చామ దుంపలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియలో సమస్యలను నివారిస్తుంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. చామ దుంపను తినడం వలన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పొటాషియం అధికంగా లభిస్తుంది.

దీనితో సెల్ ఫంక్షన్స్ నార్మల్ గా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. క్యాన్సర్ నిరోధానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. క్యాన్సర్ తో ఇబ్బంది పడేవాళ్ళు లేదా క్యాన్సర్ రిస్క్ ఉన్న వాళ్ళు చామ దుంపను తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ బాగా సహాయం చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కంటి ఆరోగ్యాన్ని మెరుగు పర్చడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. చూశారా చామదుంప వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో…! మరి మీ డైట్ లో చేర్చండి ఆరోగ్యంగా ఉండండి.

Also Read:

మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా ? దాని లక్షణాలు… తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుసుకుందాం..