Cashew Benefits: జీడిపప్పు తింటే బరువు తగ్గుతారా..? అసలు నిజాన్ని తప్పనిసరిగా తెలుసుకోండి..

|

Jul 16, 2022 | 1:37 PM

పోషకాలు ఎక్కువగా ఉండటంతో జీడిపప్పును పలు రకాల ఆహార పదార్థాలల్లో వినియోగిస్తారు. అదే సమయంలో చాలామంది సందేహం ఏంటంటే.. జీడిపప్పు తింటే బరువు తగ్గించుకోగలమా..?

Cashew Benefits: జీడిపప్పు తింటే బరువు తగ్గుతారా..? అసలు నిజాన్ని తప్పనిసరిగా తెలుసుకోండి..
Cashew Health Benefits
Follow us on

Cashew health benefits: డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఆరోగ్యానికి చాలా మంచిది. మితంగా తింటేనే శరీరానికి ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. జీడిపప్పులో ఎన్నో పోషకాలు దాగున్నాయి. వాస్తవానికి చాలా మంది జీడిపప్పును ఇష్టంగా తింటుంటారు. ఎందుకంటే ఇవి రుచిగా ఉంటాయి. ఇంకా పోషకాలు ఎక్కువగా ఉండటంతో జీడిపప్పును పలు రకాల ఆహార పదార్థాలల్లో వినియోగిస్తారు. అదే సమయంలో చాలామంది సందేహం ఏంటంటే.. జీడిపప్పు తింటే బరువు తగ్గించుకోగలమా..? ఈ ప్రశ్న అందరి నుంచి వస్తుంది. జీడి పప్పు తింటే బరువు పెరుగుతారని, అందుకే బరువు తగ్గాలనుకునే వారు తినొద్దంటూ చాలామంది పేర్కొంటుంటారు. అయితే.. ఇలాంటి విషయాలను పట్టించుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవమేదో గ్రహించకుండా నిర్ధారించుకోవద్దంటూ పేర్కొంటున్నారు. కావున జీడిపప్పు తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతామో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కాకుండా దాని ప్రయోజనాలు ఏమిటో కూడా తెలుసుకుందాం..

బరువు తగ్గుతారు..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీడిపప్పు తింటే బరువు తగ్గుతారు. కొంతమందికి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఈ డ్రై ఫ్రూట్ ఖచ్చితంగా మీ బరువును తగ్గించగలదని నిపుణులు పేర్కొంటున్నారు. కావున దీన్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిదని.. క్రమంగా శరీరం ఫిట్‌గా మారుతుందని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

జీడిపప్పు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

  • జీడిపప్పు తినడం ద్వారా మలబద్ధకాన్ని అధిగమించవచ్చు. వాస్తవానికి ఈ డ్రై ఫ్రూట్ తీసుకోవడం వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. పదే పదే పొట్ట ఉబ్బరంగా ఉండే వారు ఖచ్చితంగా జీడిపప్పును తినాలి. దీనివల్ల కడుపు ఉబ్బరం ఉండదు.
  • ఎముకలు బలహీనంగా ఉన్నవారు జీడిపప్పును తినవచ్చు. ఇది మీ ఎముకలను బలపరుస్తుంది. దీన్ని తీసుకోవడం ద్వారా, శరీరంలో కాల్షియం మంచి మొత్తంలో అందుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజూ నాలుగు లేదా ఐదు జీడిపప్పులను తప్పనిసరిగా తినండి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..