ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎందరో ఉన్నారు. రోజురోజుకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలున్న ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. రోజు వారి జీవన విధానంలో మార్పులు చేసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవచ్చు. ఈ కాలంలో కూడా అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఇక శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్లో ఉంచుకునేందుకు క్యారెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. క్యారెట్‌లో బీటా-కెరోటిన్ స్థాయిలు పుష్కలంగా ఉంటాయి. ఈ బీటా-కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ఎగా మారి శరీరంలో ఉండే చెడు కొవ్వు పదార్థాలను బయటకు తొలగించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంతేకాదు క్యారెట్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంటుంది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియంతో అధికంగా ఉంటుంది. అలాగే బరువు తగ్గేందుకు, కంటి ఆరోగ్యం ఉంచేందుకు విటమిన్లు, ఖనిజాలు అధిక సంఖ్యలో ఉంటాయి.
క్యారెట్ రసం దృష్టికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. క్యారెట్‌లోని విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. ఇది దృష్టిని మెరుగు పరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చూపు మెరుగుపడుతుంది.
క్యారెట్‌లో ఉండే విటమిన్లు జుట్టు పొడిబారకుండా చేస్తుంది. రోజు ఉదయాన్నే క్యారెట్ తింటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. పోటాషియం రక్త నాళాల ధమనుల ఉద్రిక్తతను తగ్గించేందుకు క్యారెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణ పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. చర్మం కాంతివంతగా ఉంచుతుంది. క్యారెట్ తినడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరిగిపోతుంది. తద్వారా బరువు కూడా తగ్గేందుకు దోహదపడుతుంది. క్యారెట్‌లో రక్తహీనత పోగొట్టే గుణం ఉంటుంది. ఇది ప్రేగుల్లో వ్వర్థాలను శుభ్రం చేసేలా చేస్తుంది. క్యారెట్‌ను తరచు తీసుకోవడం వల్ల మలబద్దకాన్ని దూరం చేస్తుంది. క్యారెట్‌లో పోషక విలువలతో పాటు రోగనిరోధక శక్తి పెంచే గుణాలున్నాయి.
క్యారెట్ జ్యూస్ రోజూ తాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా శరీరంలో వచ్చే వాపులను సైతం అధిగమించవచ్చు. బాక్టీరియా, వైరస్ లాంటివి నశిస్తాయి. వీటిలో ఉండే విటమిన్ బి6, కె. పొటాషియం, పాస్ఫరస్‌లు ఎముకలను దృఢంగా మారుస్తాయి. క్యారెట్ గుండె సమస్యలను కూడా తగ్గిస్తుంది. శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ అనే అణువులు ఉండడం వలన రోగనిరోధక శక్తి తగ్గుతుంది. వీటి వల్ల క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. క్యారెట్ జ్యూస్ తాగడం వలన అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆ ఫ్రీ ర్యాడికల్స్ అణువులను నాశనం చేయడంతోపాటు, శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపుతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..