Weight Loss Drink: సన్నగా కావాలంటే ఈ జ్యూస్ తాగండి.. మస్తు పని చేస్తుంది..!

ప్రస్తుత రోజుల్లో ఆకర్షణీయమైన శరీరాకృతిని కలిగి ఉండాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే బరువు తగ్గడం అనేది కేవలం ఆలోచనల్లోనే సులభంగా అనిపిస్తుంది. వాస్తవానికి చాలా మంది మొదటి రోజుల్లో ఉత్సాహంగా ప్రయత్నించినా.. కొంతకాలానికి పట్టు వదిలేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం సరైన మార్గదర్శకత్వం లేకపోవడమే. కేవలం తక్కువ ఆహారం తీసుకోవడం కాకుండా.. జీవనశైలిలో కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకోవడం చాలా ముఖ్యం.

Weight Loss Drink: సన్నగా కావాలంటే ఈ జ్యూస్ తాగండి.. మస్తు పని చేస్తుంది..!
Weight Loss Diet

Updated on: May 20, 2025 | 5:05 PM

ఆహారం పట్ల శ్రద్ధ చూపించడంలో భాగంగా.. శరీరానికి ఉపయోగకరంగా ఉండే కొన్ని సహజమైన జ్యూస్‌లు తీసుకోవడం ఎంతో ఉత్తమం. వాటిలో క్యారెట్ జ్యూస్ ప్రత్యేక ప్రాధాన్యం పొందింది. దీనిలో ఉండే పోషకాలు శరీరాన్ని శుభ్రపరచడంతో పాటు బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. క్యారెట్‌ లో ఫైబర్ మోతాదులో ఉండటం వల్ల ఇది జీర్ణ వ్యవస్థను ఉత్తమంగా పని చేసేలా చేస్తుంది. బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు వంటి పదార్థాలు శక్తినిచ్చే తత్వాన్ని కలిగి ఉంటాయి.

క్యారెట్ జ్యూస్ ఈ జ్యూస్ అధికంగా తినే అలవాటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీన్ని తాగిన తర్వాత ఆకలి తగ్గుతుంది, తద్వారా ఎక్కువగా తినకుండా ఉంటారు. ఫలితంగా శరీరంలో కాలరీలు తగ్గడానికి తోడ్పడుతుంది.

క్యారెట్‌ లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడటంతో పాటు, శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది.

సహజమైన తీపి ఉన్నప్పటికీ దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించగలదు. అందుకే మధుమేహం ఉన్నవారు కూడా దీన్ని మితంగా తీసుకోవడం మంచిది.

క్యారెట్‌లో ఉండే పోషకాల ప్రభావంతో చర్మానికి ఆరోగ్యకరమైన నిగారింపు వస్తుంది. ఇది శరీరంలో సహజమైన ప్రకాశాన్ని పెంచడానికి సహాయపడుతుంది.

క్యారెట్ జ్యూస్ తయారు చేయడానికి ముందుగా రెండు నుంచి మూడు తాజా క్యారెట్లు తీసుకోని శుభ్రంగా కడిగి పై పొట్టు తీసేయాలి. ఆ తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేయాలి. ఇప్పుడు తగినంత నీరు వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని బట్టతో వడకట్టాలి. రుచి కోసం నిమ్మరసం లేదా కొద్దిగా అల్లం కూడా కలుపుకోవచ్చు.

ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే శక్తివంతమైన ఫలితాలు లభిస్తాయి. దాంతో శరీరం టాక్సిన్లను బయటకు పంపి స్వచ్ఛతను కాపాడుతుంది. రోజూ ఇలా చేస్తే కొన్ని వారాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ జ్యూస్‌ను తాగడమే కాకుండా.. మీరు రోజూ తీసుకునే ఆహారంలో పచ్చి కూరగాయలు, ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలను తప్పకుండా చేర్చాలి. ఉదాహరణకు చికెన్ సలాడ్, గ్రీన్ సలాడ్ వంటి ఆరోగ్యకరమైన ఎంపికలను తీసుకోవచ్చు. అంతేకాకుండా వ్యాయామాన్ని నిత్యక్రమంగా కొనసాగించడం కూడా అత్యంత అవసరం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)