Carom Seeds Benifits: అనారోగ్య సమస్యలను నియంత్రించే ఔషధాలు మన వంటిట్లోనే ఎన్నో ఉంటాయి. కానీ మనం అలాంటి ఔషధాలపై పెద్దగా దృష్టిసారించం. అయితే.. అలాంటి దినుసుల్లో వాముకు చాలా ప్రాధాన్యత ఉన్నది. దీని రుచి ఘాటుగా ఉంటుంది. వామను మనం రోజూ తింటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే దీనిని పలు ఔషధాల తయారీలో కూడా వాడుతారు. వాము తరచుగా తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. జలుబు, దగ్గు తగ్గుతుంది. బొంగురు పోయిన గొంతు సైతం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. వాము తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి తెలుసుకుందాం.
➼ వామును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిలో కొద్దిగా తేనే వేసుకుని తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కరుగుతాయి.
➼ శ్వాసకోస సమస్యలతో ఇబ్బంది పడే వారు వాము టీ చేసుకుని తాగడం మంచిది. అంతేకాదు వాము టీ తాగడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు దరిచేరవు.
➼ అసిడిటీ, జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడే వారు వాము నీటిని తాగితే.. ఈ సమస్యలు తగ్గుతాయి.
➼ వాము తినడం వల్ల మలబద్దకం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
➼ గర్భిణీ, బాలింతలకు వాము మేలు చేస్తుంది.
➼ కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా వాము కీలక పాత్ర పోషిస్తుంది.
➼ వాము నూనెను కీళ్లకు మర్దనా చేస్తే.. నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
➼ వాము శరీరంలో పేరుకు పోయిన కొవ్వును తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
➼ అంతేకాకుండా రకరకాల ఇన్ఫెక్షన్స్ సోకకుండా వాము దివ్యఔషధంలా పనిచేస్తుంది.
➼ తలనొప్పి, మైగ్రేన్, అలసటను కూడా తగ్గిస్తుంది.
➼ వాములో పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు ఎక్కువుగా ఉండటం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
Also Read: