Health Tips: డయాబెటిస్ రోగులకు ఈ నీరు వరం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు..

|

Sep 23, 2022 | 7:04 PM

మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే వివిధ పోషకాలు ఇందులో ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్ లు కూడా ఉంటాయి. వీటిలో కేలరీలు, కార్భోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి.

Health Tips: డయాబెటిస్ రోగులకు ఈ నీరు వరం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు..
Cardamom Water
Follow us on

Health Tips: ఆహార పదార్థాల రుచిని పెంచేందుకు ఏలకులను ఉపయోగిస్తారు. ఇది ప్రతి ఒక్కరి వంటగదిలో సులభంగా లభించే మసాలా. ఏలకులు రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదని చాలా మందికి తెలియదు. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే వివిధ పోషకాలు ఇందులో ఉన్నాయి. ఏలకులు మాత్రమే కాదు, యాలకుల నీరు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా? అవును, ఏలకుల నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా ఏలకులకు ప్రత్యేక స్థానముంది. ఏలకుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఏలకుల నీరు తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఏలకులలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఏలకులలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఏలకులలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్ లు కూడా ఉంటాయి. వీటిలో కేలరీలు, కార్భోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి.

ఏలకుల నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఊబకాయం సమస్య ఉన్నట్లయితే.. మీరు ఏలకుల నీటిని తీసుకోవచ్చు. ఎందుకంటే యాలకులలోని యాంటీ ఆక్సిడెంట్ ఫైబర్, ఇతర ముఖ్యమైన పోషకాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. అందువల్ల బరువు తగ్గడానికి దీనిని ఆహారంలో చేర్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తుంది
ఏలకులలోని ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. మలబద్ధకం సమస్య ఉంటే మీరు ఏలకుల నీటిని తీసుకోవడం కొనసాగించవచ్చు. దీంతో ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు రోజూ ఏలకుల నీటిని తీసుకోవాలి. ఏలకుల నీరు కొలెస్ట్రాల్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది
ఏలకుల నీరు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల డయాబెటిక్ రోగుల ఆహారంలో ఏలకుల నీటిని క్రమం తప్పకుండా చేర్చవచ్చు.
భోజనం చేసిన తరువాత నోటిలో ఏలకులను పెట్టుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది.

ఏలకుల నీటిని ఎలా తయారు చేయాలి
నాలుగైదు ఏలకులను తీసుకుని ఒక లీటర్‌ నీటిలో నానబెట్టాలి. రాత్రంతా నాని తర్వాత ఈ నీటిని మరుసటి రోజు ఉదయం బాగా మరిగించాలి. ఆ తర్వాత వడకట్టి ఒక చల్లారనివ్వాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని ప్రతిరోజూ ఉదయం పరిగడుపున తాగితే మంచిది. ఇలా కొంతకాలం క్రమం తప్పకుండా చేస్తే తప్పక ఫలితం ఉంటుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి