Pregnant Women: గర్భిణీగా ఉన్నప్పుడు కొంతమంది తెలియక చేసే తప్పులు వారిని ప్రమాదంలోకి తీసుకెళుతాయి. అందుకే ఆ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం, ఫిట్‌నెస్ విషయంలో శ్రద్ధ పెట్టాలి. ఏవి తినకూడదు ఏవి తినాలో తెలుసుకోవాలి. పోషకాహారంపై దృష్టి సారించాలి. పండ్లు, కూరగాయలు, పప్పులు, పాల ఉత్పత్తులు, మాంసం ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే శిశువు ఎదుగుదల సరిగ్గా జరుగుతుంది. లేదంటే ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. వాస్తవానికి ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమంది చేపలు తినకూడదని అంటారు. ఇందులో నిజం లేకపోలేదు. కానీ ఎటువంటి చేపలు తినాలో తెలుసుకోవాలి.
కొంతమంది మహిళలకి చేపలు అంటే ఇష్టముండదు. మరికొంతమంది ఇష్టంతో తింటారు. ఇలాంటి సమయంలో వైద్యుడి సలహా తీసుకుంటే మంచిది. వాస్తవానికి గర్భధారణ సమయంలో చేపలు తినడం ప్రయోజనకరం. కానీ పాదరసం అధికంగా ఉండే చేపలను తినకుండా ఉండాలి. ఉదాహారణకు సముద్రపు చేపలలో పాదరసం ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భిణుల ఆరోగ్మానికి మంచిది కాదు. అయితే మంచి నీటి చెరువులు, సరస్సులలో పెరిగే చేపలను తీసుకుంటే మంచిదే. దీనిపై చాలామందికి అవగాహన లేక ఇబ్బందిపడుతుంటారు.
అలాగే గర్భిణిగా ఉన్నప్పుడు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. రిఫైన్డ్ చేసిన పిండి, ప్రొసెస్డ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ధూమపానం, మద్యపానం, ఎక్కువ కెఫిన్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, పచ్చి గుడ్లు, పచ్చి సీ ఫుడ్, ఎలర్జీ ఆహార పదార్థాలు, బొప్పాయి, తదితర కొన్ని ఆహారాలకి దూరంగా ఉండాలి. ఆకు కూరలు, టోఫు, తక్కువ కొవ్వు ఉండే పాలు, పాల పదార్థాలలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి గర్భధారణ సమయంలో క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలు తప్పక తీసుకోవాలి.