Cabbage: కూరగాయలలో క్యాబేజీ గురించి తెలియని వారు ఉండరు. చాలా మంది ప్రజలు తమ వంటకాల్లో క్యాబేజీని తప్పనిసరిగా చేసుకుంటారు. కూరలు, సలాడ్లు, సూప్‌లు, చైనీస్ వంటలలో కూడా క్యాబేజీని వినియోగిస్తుంటారు. అయితే, క్యాబేజీలో అద్భుతమైన పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యాబేజీలో పాలతో సమానంగా ఐరన్, పొటాషియం, కాల్షియం ఉంటాయని తెలిపారు. ఇది అనేక సమస్యల నుంచి బయటపడేస్తుందని చెబుతున్నారు. మరి క్యాబేజీతో కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజీలో పుష్కలంగా కాల్షియం..
క్యాబేజీలో పాలతో సమానమైన కాల్షియం ఉంటుంది. ఇది మీ ఎముకలను బలపరుస్తుంది. చాలా మంది పాలు తాగడానికి ఇష్టపడరు. ఫలితంగా పాలలో ఉండే ప్రయోజనాలను పొందలేదు. అలాంటి వారు.. క్యాబేజీని ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఉదర సమస్యల నుంచి ఉపశమనం..
క్యాబేజీ ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది మీ జీర్ణశక్తిని పెంచి కడుపు నొప్పిని దూరం చేస్తుంది. దీన్ని తినడం వల్ల కడుపులో నులిపురుగుల సమస్య కూడా నయమవుతుంది.
బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది..
బరువు తగ్గాలనుకునే వారు క్యాబేజీని ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉడికించిన క్యాబేజీలో 33 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇది మీ శరీరానికి పుష్కలంగా శక్తిని ఇస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. సూప్, కూరగాయలు, సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.
ఐరన్, పొటాషియం పుష్కలం..
క్యాబేజీలో ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వలన రక్త హీనత సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బీపీ, గుండె సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
కండరాల నొప్పుల నుంచి ఉపశమనం..
కండరాల నొప్పులతో బాధపడుతున్నట్లయితే.. క్యాబేజీ మీకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో లాక్టిక్ యాసిడ్ అనే మూలకం ఉంటుంది. ఇది సహజ నొప్పి నివారణిగా పని చేస్తుంది.
Also read:
Benefits of Methi: మెంతులతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఆకలిని పెంచడమే కాదు..
Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై కేసు నమోదు.. ఎందుకంటే..