మీ బ్రెయిన్ షార్ప్‌ గా ఉండాలంటే.. ఇవి తప్పకుండా తినాల్సిందే..!

మనిషి శరీరంలో మెదడు అత్యంత కీలకమైన అవయవం. దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని సహజ ఆహారాలు మెదడు శక్తిని పెంచి, జ్ఞాపకశక్తిని బలపరుస్తాయి. ఈ ఆహారాలను రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే మెదడు చురుకుగా, ఆరోగ్యంగా ఉంటుంది.

మీ బ్రెయిన్ షార్ప్‌ గా ఉండాలంటే.. ఇవి తప్పకుండా తినాల్సిందే..!
Healthy Brain

Updated on: Aug 18, 2025 | 9:50 PM

మన శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన అవయవం. దీని పనితీరు సరిగా లేకపోతే ఏ పని సరిగా జరగదు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి వంటి వాటిని మెరుగుపరచాలంటే మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలు మెదడును చురుకుగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్లు, కెఫిన్ ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే రక్త ప్రసరణను పెంచి ఏకాగ్రతను బలోపేతం చేస్తాయి.

బ్రోకోలీ

బ్రోకోలీలో విటమిన్ K, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను కాపాడటంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

నట్స్

అక్రోట్, బాదం వంటి నట్స్ మెదడుకు చాలా మంచివి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E ఉంటాయి. ఇవి వయసు పెరిగినా జ్ఞాపకశక్తి తగ్గకుండా చూస్తాయి.

చేపలు

సాల్మన్, మాక్రెల్ వంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆలోచనా శక్తిని పెంచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. పిల్లల తెలివితేటలు పెరగడానికి కూడా చేపలు ఉపయోగపడతాయి.

పసుపు

పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మెదడులో వాపును తగ్గించి డిప్రెషన్ వంటి సమస్యలను నివారిస్తుంది. పసుపు తీసుకోవడం వల్ల మెదడులో కొత్త కణాలు కూడా పెరుగుతాయి.

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి మెదడుకు శక్తినిచ్చి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

బ్లూబెర్రీస్

బ్లూబెర్రీస్‌ లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి. అలాగే జ్ఞాపకశక్తిని పెంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి సహాయపడతాయి. ఈ ఆహారాలను రోజూ తీసుకుంటే మెదడు చురుకుగా ఉండటమే కాకుండా దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)