Health tips : ప్రస్తుతం ఎంతో మంది ఆహార నియమాలు పాటించకపోవడం, ఇతర ఒత్తిడిల కారణంగా వ్యాధుల బారిన పడతున్నారు. ఒత్తిడితో కూడిన ఆధునిక జీవనం, ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ అలవాట్లు ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు (Blood pressure) బాధితులను పెంచుతున్నాయి. ఉప్పు, మసాలాలు, ప్రాసెస్డ్ ఆహారాలకు దూరంగా ఉండటంతో అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బీపీ రోగులు పచ్చళ్లు, అప్పడాలు, రెడీ టూ ఈట్ ప్యాకేజ్డ్ ఆహార పదార్ధాలను పక్కనపెట్టాలని ప్రముఖ డైటీషియన్లు సూచిస్తున్నారు. బీపీ రోగులు సోడియం అధికంగా ఉండే పదార్ధాలు తీసుకుంటే కార్డియోవాస్క్యులర్ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్ధాలతో పాటు సంతృప్త కొవ్వులు, చక్కెరలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
తాజా పండ్లు, కూరగాయలు, కొవ్వు తక్కువగా ఉండే డెయిరీ ఉత్పత్తులు, సిరిల్స్, పప్పుధాన్యాలు, ఆకుకూరలను తరచుగా తీసుకోవాలి. చేపలు, గుడ్లను తీసుకోవడంతో పాటు ఫ్రోజన్, క్యాన్డ్ ఆహారాలకు దూరం కావాలి. తీపిపదార్ధాలు, శీతల పానీయాలను పూర్తిగా అవాయిడ్ చేయాలి. జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, పండ్లు, విటమిన్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు.
ఇవి కూడా చదవండి: