Boiled lemon water: నిమ్మకాయతో అలా చేయండి.. ఇలా రక్తపోటును తగ్గించుకోండి..

|

Oct 31, 2021 | 12:27 PM

మనకు చౌకగా దొరికే నిమ్మకాయ వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వేడి నీటిలో నిమ్మకాయం పిండుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది. నిమ్మకాయ ఉడికించిన నీరు తాగితే కూడా మనకు లాభమే..

Boiled lemon water: నిమ్మకాయతో అలా చేయండి.. ఇలా రక్తపోటును తగ్గించుకోండి..
Lemon
Follow us on

మనకు చౌకగా దొరికే నిమ్మకాయ వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వేడి నీటిలో నిమ్మకాయం పిండుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది. నిమ్మకాయ ఉడికించిన నీరు తాగితే కూడా మనకు లాభమే. ఆరోగ్య ప్రయోజనాల కోసం నిమ్మకాయ నీళ్లు తాగడం ఎప్పటి నుంచో ఉంది.

లెమన్ వాటర్ లో ఉండే పోషకాలు
నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. ఒక నిమ్మకాయ రసం ఒక వ్యక్తి యొక్క ఒక రోజులో తీసుకునే సి విటమిన్‎లో 21 శాతం అందిస్తుంది. నిమ్మలో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిధోక శక్తిని పెంచుతాయి. నిమ్మరసంలో కొవ్వు, పిండి పదార్థాలు, చక్కెర తక్కువగా ఉంటాయి. కానీ పొటాషియం, ఫోలేట్, విటమిన్ బీతో సహా అనేక విటమిన్లు, ఖనిజా లవణాలు ఉంటాయి. ఆహార మార్గదర్శకాల ప్రకారం 19 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలు తప్పనిసరిగా 75 mg విటమిన్ సి తీసుకోవాలి, 19 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మగవారికి ఇది రోజుకు 90 mg తీసుకోవాలి. ధూమపానం చేయని వారి కంటే ధూమపానం చేసే వారికి విటమిన్ సి అవసరం ఎక్కువ ఉంటుంది.

చర్మాన్ని తాజాగా ఉంచుతుంది
విటమిన్ సి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఇది లెమన్ వాటర్ సమృద్ధిగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మీ చర్మాన్ని కాపాడుతుంది. ఇది వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. విటమిన్ సి తీసుకోవడం వల్ల గాయాలు త్వరగా నయం అవుతాయి.

రక్తపోటును తగ్గిస్తుంది
నిమ్మకాయ రక్తపోటును తగ్గించడంలో ప్రయోజనకరమైనకరంగా ఉంటుంది. కాల్షియం, పొటాషియం రెండూ రక్తపోటుతో బాధపడేవారిలో రక్తపోటును తగ్గిస్తాయి. లెమన్ వాటర్ వెంటనే రక్తపోటును సాధారణ స్థాయికి తీసుకురావడానికి సహాయపడుతుందని ఒక అధ్యయనం సూచిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది
విటమిన్ సి కూడా రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంది. ప్రతిరోజూ ఈ నిమ్మరసం తీసుకోవడం వల్ల కొవిడ్ మరియు ఫ్లూ వంటి శ్వాసకోశ రుగ్మతల నుంచి రక్షణ పొందవచ్చు.

Read Also.. Teeth Pain: మీరు స్వీట్ తింటుంన్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి.. పంటినొప్పి రాకుండా చేసుకోండి..