Health: మలం నల్లగా వస్తుందా..? వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లండి..

ముఖ్యంగా ఆల్కాహాల్ వల్ల లివర్ పాడవుతుంది. అందుకే దాన్ని బంద్ పెట్టాలి. ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే.. వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేసుకుంటూ చికిత్స తీసుకోవాలి. తినే ఫుడ్ విషయంలో కూడా నియంత్రణ ఉండాలి. ఆయిల్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటే మంచింది.

Health: మలం నల్లగా వస్తుందా..? వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లండి..
Wash Room -- GETTY IMAGES

Updated on: Mar 09, 2024 | 5:46 PM

మన శరీరంలో లివర్ కీ రోల్ పోషిస్తోంది. ఆహారంలోని విష పదార్థాలను క్లీన్ చేసి బయటకు పంపుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. ముఖ్య మైన ప్రోటీన్లను తయారు చేయడం, నిల్వ చేయడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. లివర్‌కు వచ్చే ప్రధాన సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చ కామెర్లు వచ్చాయంటే లివర్ సమస్యల్లో ఉందని గుర్తించాలి. యూరిన్ పచ్చగా రావడం, కళ్లు పచ్చగా అవ్వడం.. కామెర్ల ప్రధాన లక్షణాలు. మద్యం అధికంగా తాగడం వల్ల,   ఇన్ఫెక్షన్ల వల్ల, కొన్ని రకాల మందులు, ఏదైనా క్యాన్సర్, పిత్తాశయంలో తయారయ్యే రాళ్ల వల్ల కామెర్లు రావొచ్చు.  పచ్చ కామెర్లకు ముందు కారణం ఏంటో కనిపెట్టి.. దానికి తగ్గట్లు డాక్టర్లు చికిత్స చేస్తారు.

అలానే మద్య పానం,హెపటైటిస్ బీ ఇన్ఫెక్షన్ వంటివి తీవ్రమైనప్పుడు లివర్ ఫెయిల్ అవ్వొచ్చు. పచ్చ కామెర్లు సమస్య తీవ్రమైతే లివర్ సిర్రోసిస్ వస్తుంది. అలానే వాంతిలో రక్తం పడడం, మలం నల్లగా రావడం, కడుపులో రక్తనాళాలు వాపు , పొట్టలో నీరు చేరడం, అదే పనిగా పొట్ట ఉబ్బరం,  శరీరం అంతా నీరు నిలవడం వంటి సమస్యలను లివర్ సిర్రోసిస్ సింటమ్స్ కింద చెప్తారు. ఈ పరిస్థితి తీవ్రమై బాడీలో నిలిచిపోయిన విష పదార్ధాలు మెదడుకు చేరి, స్పృహలో లేకుండా అయ్యే ప్రమాదం ఉంది. సిర్రోసిస్ తర్వాత కాలేయ క్యాన్సర్ కూడా దారితీస్తుంది.

అందుకే.. ఇలాంటి సింటమ్స్ ఏవైనా కనిపిస్తే.. లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించాలి. అలానే USG ABDOMEN చేయించి డాక్టర్‌ను సంప్రదించాలి. ఆ రిపోర్ట్స్ చూసి..  ప్రోత్రాంబిన్ టైం,  హీమోగ్రాం వంటి టెస్టులు డాక్టర్లు రాసే అవకాశం ఉంది. వాటిని బట్టి చికిత్స చేస్తారు. శారీరక వ్యాయామం చేయని వారికి, లేక అధికంగా మద్యపానం చేసే వారికి , ఫాస్ట్ ఫుడ్ తినేవారికి  ఫ్యాటీ లివర్ అనేది కామన్ అయిపోయింది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే లివర్ ఫెయిల్యర్‌కి దారి తీసే అవకాశం ఉంది. సో హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి.. ఆల్కాహాల్ తగ్గింది.. కుదిరితే తాగడం ఆపేసి కాలేయాన్ని రక్షించుకోండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి