Black Pepper Removes Depression: డిప్రెషన్ ను దూరం చేసే మిరియాలు.. ఇలా వాడండి!

|

Oct 17, 2023 | 8:47 PM

మనం వంటల్లో ఉపయోగించే వాటిల్లో మిరియాలు కూడా ఒకటి. వీటిని ఆయుర్వేదంలో కూడా విరివిగా వివిధ అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడంలో ఉపయోగిస్తారు. మన దేశంలో పురాతన కాలం నుంచి మిరియాలను ఆరోగ్యం కోసమే కాకుండా.. వ్యాధులను నయం చేయడంలో కూడా ఉపయోగిస్తూంటారు. ఇవి ఘాటుతో పాటు మంచి రుచిని కూడా ఇస్తాయి. వీటిని నేరుగా లేదా పొడి రూపంలో కూడా వంటల్లో వాడుతూ ఉంటారు. నల్ల మిరియాల్లో ఎన్నో ఔషధ గుణాలు..

Black Pepper Removes Depression: డిప్రెషన్ ను దూరం చేసే మిరియాలు.. ఇలా వాడండి!
Black Pepper
Follow us on

మనం వంటల్లో ఉపయోగించే వాటిల్లో మిరియాలు కూడా ఒకటి. వీటిని ఆయుర్వేదంలో కూడా విరివిగా వివిధ అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడంలో ఉపయోగిస్తారు. మన దేశంలో పురాతన కాలం నుంచి మిరియాలను ఆరోగ్యం కోసమే కాకుండా.. వ్యాధులను నయం చేయడంలో కూడా ఉపయోగిస్తూంటారు. ఇవి ఘాటుతో పాటు మంచి రుచిని కూడా ఇస్తాయి. వీటిని నేరుగా లేదా పొడి రూపంలో కూడా వంటల్లో వాడుతూ ఉంటారు. నల్ల మిరియాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి వీటిని ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే ఇవి ఘాటుగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా తీసుకోకూడదు. వాతవ చేసే గుణం మిరియాల్లో ఉంది. అలాగే వీటిని వేసవి కాలంలో కంటే.. వర్షా కాలం, చలి కాలంలో ఉపయోగిస్తే వివిధ అనారోగ్య సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు. ఇంకా నల్ల మిరియాల వల్ల ఎలాంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్నో పోషకాలు:

నల్ల మిరియాల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఫైబర్, మాంగనీస్, విటమిన్లు ఎ, బి, సి, కె, ఇ, క్యాల్షియం, పోటాషియం వంటివి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

డిప్రెషన్ ను దూరం చేస్తాయి:

డిప్రెషన్ ను దూరం చేసే గుణం మిరియాల్లో ఉంది. డిప్రెషన్ ను తగ్గించి బ్రెయిన్ ను చురుకుగా, యాక్టీవ్ గా పని చేసేలా చేయడంలో పెప్పర్ బాగా పని చేస్తుంది. డిప్రెషన్ తో బాధ పడే వారికి మిరియాలతో చేసిన ఆహారం పెడితే.. త్వరగా దాని నుంచి దూరం అవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వృద్ధ్యాప్య ఛాయలు దరి చేరవ్వదు:

నల్ల మిరియాలు తినడం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగు పడుతుంది. దీంతో వృద్ధ్యాప్య ఛాయలు రావు. అంతే కాకుండా చర్మం ముడతలు పడకుండా.. యంగ్ గా ఉండేలా చేస్తుంది.

జీర్ణ సమస్యలు ఉండవు:

నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి అనేది మెరుగు పడుతుంది. అలాగే జీర్ణ సమస్యలు కూడా రాకుండా చేసే శక్తి మిరియాల్లో ఉంది. మల బద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను తగ్గించడంలో మిరియాలు చక్కగా పని చేస్తాయి.

రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది:

మిరియాలతో తయారు చేసిన ఆహారం తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజన్ల వ్యాధులను తగ్గిస్తుంది. జలుబు, ఆస్తమా, దగ్గు, సైనస్, ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో మిరియాలు బాగా హెల్ప్ అవుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.