Biryani Leaf Benefits: ఆ సమస్యలున్న వారికి వరం బిర్యానీ ఆకులు.. ఇలా తీసుకుంటే ప్రమాదకర వ్యాధులు సైతం..

|

Jan 10, 2023 | 10:01 PM

చలికాలంలో చాలా మంది జలుబు, ఫ్లూ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. సైనస్ సమస్యలు ఉన్నవారికి వింటర్ సీజన్ పెను విపత్తుగా ఉంటుంది. అలాంటి వారికి బిర్యానీ ఆకులు వరమని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Biryani Leaf Benefits: ఆ సమస్యలున్న వారికి వరం బిర్యానీ ఆకులు.. ఇలా తీసుకుంటే ప్రమాదకర వ్యాధులు సైతం..
Biryani Leaf Benefits
Follow us on

చలికాలంలో చాలా మంది జలుబు, ఫ్లూ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. సైనస్ సమస్యలు ఉన్నవారికి వింటర్ సీజన్ పెను విపత్తుగా ఉంటుంది. అలాంటి వారికి బిర్యానీ ఆకులు వరమని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. బిర్యానీ ఆకులు (బే ఆకులు) అనేక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. సాధారణంగా బిర్యానీ ఆకులు ప్రతి ఒక్కరి వంటగదిలో ఎక్కువగా ఉంటాయి. వీటిని మసాలా దినుసులుగా ఉపయోగిస్తారు. అయితే.. బిర్యానీ ఆకుల్లో చాలా ఔషధ గుణాలు దాగున్నాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రయోజనకరంగా ఉంటాయి. స్ట్రేస్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే, బిర్యానీ ఆకులు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

బిర్యానీ ఆకులను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  1. రోగనిరోధక శక్తి: బిర్యానీ ఆకులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి విటమిన్ ఎ, బి6, విటమిన్ సికి మంచి మూలం. ఈ విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
  2. జీర్ణక్రియ: బిర్యానీ ఆకు మన జీర్ణవ్యవస్థను కూడా బలపరుస్తుంది. ఇది కడుపు నొప్పిని కూడా నయం చేస్తుంది. అంతే కాదు కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  3. సైనస్: బిర్యానీ ఆకులు ముక్కు కారటం సమస్యను చాలా త్వరగా నయం చేస్తుంది. మరోవైపు, ఎండుమిర్చిని బిర్యానీ ఆకులతో కలిపి తీసుకుంటే సైనస్ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
  4. మధుమేహం: బిర్యానీ ఆకులతో చేసిన క్యాప్సూల్‌ను టీలో కలిపి తాగడం వల్ల రక్తంలో చక్కెర చాలా తగ్గుతుంది. మరోవైపు, బీ లీఫ్ టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. కొలెస్ట్రాల్: బిర్యానీ ఆకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో పాటు ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిలోని కెఫీక్ అనే ఆర్గానిక్ సమ్మేళనం గుండెకు మంచిదిగా పరిగణిస్తారు.

బిర్యానీ ఆకులను ఈ విధంగా ఉపయోగించండి..

బే ఆకులను హెర్బల్ టీగా తయారు చేసి తాగవచ్చు. దీని కోసం బీర్యానీ ఆకులను నీటిలో వేసి మరిగించి.. టీ లాగా తాగాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..