
ఆకుకూరలు చాలా పోషకాలు నిండి ఉంటాయని డాక్టర్లు అందరూ చెబుతూ ఉంటారు. ఐరన్, కాల్సియం, విటమిన్ ఏ, సూక్ష్మ పోషకాలు, యాంటి ఆక్సిడెంట్స్, మినలర్స్ వంటివి.. కూరగాయల్లో కంటే ఆకుకూరల్లోనే ఎక్కువ ఉంటాయి. కూరగాయలు కంటే ఆకుకూరలే ఎక్కువ శక్తిని ఇస్తాయి. అంతేకాదు కూరగాయల్లో నూనె, ఉప్పు, మసాలాలు ఎక్కువ పడతాయి. కానీ ఆకుకూరల్లో అంతగా అవసరం పడవు. ఇవి పక్కనబెడితే కూరగాయల కంటే ఆకుకూరలు చాలా చవక కూడా. ముఖ్యంగా చుక్కకూరలో ఉండే పోషకాలు, దాని తినడం ద్వారా ప్రయోజనాలు ఈ రోజు తెలుసుకుందాం.
100 గ్రాముల చుక్కకూరలో.. నీటి శాతం 90 గ్రాములు, ఎనర్జీ 19 కిలో క్యాలరీలు, పిండి పదార్థాలు 2.3గ్రాములు, మాంసకృత్తులు 1.6 గ్రాములు, కొవ్వులు 1.2 గ్రాములు, పీచు పదార్థాలు 1.2గ్రాములు ఉంటాయి. ఇవన్నీ స్థూల పోషకాలు. ఇక సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే.. విటమిన్ సి 53 మిల్లి గ్రాములు, విటమిన్ కె 126 మైక్రో గ్రాములు, లూటిన్ 2370 మైక్రో గ్రాములు, బీటాకెరెటిన్ 2754 మైక్రో గ్రాములు, ఐరన్ 4 మిల్లి గ్రాములు, మెగ్నిషియం 48 మిల్లి గ్రాములు ఉంటాయి.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం క్లిక్ చేయండి.