
మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తీపి రుచిగల పండ్లకు దూరంగా ఉండాలి. కానీ పిల్లల ఆహారంలో క్యారెట్లు చేర్చవచ్చు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ క్యారెట్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. క్యారెట్లలో పిండి పదార్ధాలు ఉండవు. కాబట్టి దీనిని తినవచ్చు.
క్యారెట్‌లను ఉడికించి కాకుండా పచ్చిగా తింటే శరీరానికి కావల్సినంత పోషకాలు అందుతాయని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా క్యారెట్ మహిళలకు మేలు చేస్తుందని అంటున్నారు. కాబట్టి పచ్చి క్యారెట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం పదండి…
- పచ్చి క్యారెట్లు తింటే.. శరీరంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి కంట్రోల్‌లో ఉంటుంది. వాస్తవానికి, అదనపు ఈస్ట్రోజెన్ మెటిమలు, ఒత్తిడి సహా ఇతర హార్మోన్ల అసమతుల్యతలకు కారణమవుతుంది. ఈ సమస్యను నివారించడంలో క్యారెట్ మనకు ఉపయోగపడుతుంది. అలాగే, పచ్చి క్యారెట్లు కడుపులోని చెడు బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి.
- క్యారెట్‌లో ప్రత్యేకమైన ఫైబర్స్ ఉంటాయి. జీర్ణక్రియ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. లివర్ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
- పచ్చి క్యారెట్లు శరీరంలోని చెడు బ్యాక్టీరియా, ఎండోటాక్సిన్, ఈస్ట్రోజెన్‌లను నియంత్రిస్తాయి. రోజుకు ఒక పచ్చి క్యారెట్ తినడం వల్ల కార్టిసాల్, ఎండోటాక్సిన్, ఈస్ట్రోజెన్ అధిక స్థాయిలో ఏర్పడకుండా అడ్డుకట్ట. ఎండోటాక్సిన్‌లను నిలువరించడంలో క్యారెట్ అద్భుతంలా పనిచేస్తుంది.
- క్యారెట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ప్రకారం, 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు రోజుకు కనీసం 700 నుండి 900 మైక్రోగ్రాముల విటమిన్ A అవసరం. ఒక పచ్చి క్యారెట్ తినడం వల్ల తగినంత విటమిన్ ఎ అందుతుందని FDA పేర్కొంది.
- క్యారెట్‌లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, పచ్చి క్యారెట్‌లను తినడం వల్ల మొటిమలు, మచ్చలను నివారించవచ్చు.
- విటమిన్ ఎ థైరాయిడ్ పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. క్యారెట్‌లో విటమిన్ ఎ దండిగా ఉంటుంది. కాబట్టి హైపోథైరాయిడిజం ఉన్నవారికి క్యారెట్ ఒక వరమని చెప్పాలి.
- పచ్చి క్యారెట్ తింటే.. కంటి చూపును పదును అవుతుంది. రక్తపోటును తగ్గుతుంది. ప్రోటీన్‌ను పెంచడం, శక్తిని పెంచడం, ఎముకలను బలోపేతం చేయడం వంటి అనేక ప్రయోజనాలను చేకూరుతాయి.
- క్యారెట్‌లో క్యాలరీలు తక్కువగా, ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గుతారు. ఇది అనవసర కొవ్వును తగ్గిస్తుంది.