Black Berry: డయాబెటిస్‌తో బాధపడుతున్నారా?.. ఈ పండ్లు తినండి ఆరోగ్యంగా ఉండండి..

|

Jun 26, 2021 | 7:19 PM

Black Berry: డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు తమ శరీరంలో ఇన్సులిన్ స్థాయిని అదుపులో ఉంచడానికి కఠినమైన ఆహార నియమాలు...

Black Berry: డయాబెటిస్‌తో బాధపడుతున్నారా?.. ఈ పండ్లు తినండి ఆరోగ్యంగా ఉండండి..
Black Berry
Follow us on

Black Berry: డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు తమ శరీరంలో ఇన్సులిన్ స్థాయిని అదుపులో ఉంచడానికి కఠినమైన ఆహార నియమాలు అనుసరిస్తుంటారు. వ్యాయామాలు, యోగాలు ఇలా రకరకాల ఫీట్లు చేస్తుంటారు. అయితే, డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి కొన్ని పండ్లు, కూరగాయలు తినాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. కాలానుగుణంగా కాసే పండ్లు, కూరగాయలు ఆరోగ్యాన్ని కాపాడుతాంటారు. ముఖ్యంగా బ్లాక్ బెర్రీ(అల్లనేరడి పండు, జామున్ పండ్లు) శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం ద్వారా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. అంతేకాదు.. డయాబెటిస్‌ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పండ్లలో తక్కువ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటుంది. తక్కువ కేలరీలు, ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. ఈ కారణంగానే ఈ అల్లనేరడి పండ్లను తినాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఈ పండ్లు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయుర్వేదం ఏం చెబుతోంది?
యునాని, ఆయుర్వేదం ప్రకారం అనేక జీర్ణ సంబంధిత రుగ్మతలను ఇది తగ్గిస్తుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు. ఈ పండ్లు, చెట్టు ఆకులు, బెరడు, పండు లోపలి గింజ కూడా ఎంతో అద్భుతంగా పని చేస్తుందన్నారు. ఈ పండు గింజల్లో జాంబోలిన్ అనే రసాయనం ఉంటుంది. బెరడు, విత్తనాలు, ఆకుల రసం మన రక్తంలో ఉండే చక్కెర స్థాయిని, గ్లైకోరియాను కంట్రోల్‌ ఉంచడానికి ఉపకరిస్తుంది.

వైద్య పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
ఆల్కలాయిడ్లు అధికంగా ఉన్న అల్లనేరడి పండ్ల విత్తనాలు సీజన్లో క్రమం తప్పకుండా తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి 30 శాతం వరకు తగ్గిస్తుందట.

అల్లనేరడి పండ్లను తరచుగా తినొచ్చా?
డయాబెటిక్ రోగులు వారి శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రతీ రోజూ 10 నుంచి 12 అల్లనేరడి పండ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా తినడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

అల్లనేరడి పండ్ల విత్తనాలతో కలిగే ప్రయోజనాలు..
అల్లనేరడి పండ్ల విత్తనాల పొడి టైట్-2 డయాబెటిక్ పేషెంట్లకు చాలా మేలు చేస్తుంది. నిపుణుల ప్రకారం.. అల్లనేరడి విత్తనాల పొడి తీసుకోవడం వల్ల శరీరంలోని నీరసం తగ్గుతుంది. అంతేకాదు.. డయాబెటిస్ ప్రారంభ దశలో దీనిని తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ఇతర ప్రయోజనాలు..
అల్లనేరడి పండ్లలో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి, చర్మ సమస్యలను నివారిస్తుంది. అలాగే శరీరంలో ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది. యాంటీ డయేరియా లక్షణాలను కలిగి ఉంటుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది.

Also read:

CM KCR: పట్టణాల వారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలి.. అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం..