
బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని విటమిన్ ఎ, సితో పాటు మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇక బీట్‌రూట్‌ను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, చర్మం, కళ్లకు మేలు జరుగుతుంది. అయితే ఇంత మేలు చేసే బీట్‌రూట్ కొందరికి మాత్రం చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది బీట్‌రూట్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. ఇంతకీ బీట్‌రూట్‌ను ఎవరు తీసుకోకూడదు.? తీసుకుంటే ఎలాంటి నష్టం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
* బీట్‌రూట్‌లో ఆక్సలేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బీట్‌రూట్‌ను తినకూడదు. బీట్‌రూట్ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
* బీట్‌రూట్‌లో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి రక్తపోటు ఇప్పటికే తక్కువగా ఉంటే, బీట్‌రూట్ తినడం వల్ల రక్తపోటు మరింత తగ్గుతుంది. దీంతో ఆయాసం, తల తిరగడం, మూర్ఛ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల, తక్కువ రక్తపోటుతో బాధపడేవారు బీట్‌రూట్‌ను అస్సలు తినకూడదు.
* బీట్‌రూట్‌లో ఉండే మూలకాలు కాలేయంపై దుష్ప్రభావం చూపుతాయి. బీట్‌రూట్ తినడం వల్ల కాలేయంపై అదనపు భారం పడుతుంది, ఇది కాలేయంపై ఒత్తిడిని పెంచుతుంది. కాలేయం సామర్థ్యం ఇప్పటికే బలహీనంగా ఉంటే, అది మరింత హానికరం. కాలేయం వాపు, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
* స్కిన్ ఎలర్జీతో బాధపడేవారు కూడా బీట్‌రూట్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్ వల్ల చర్మంపై దద్దుర్లు, ఎరుపు, దురద వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి వాళ్లు బీట్‌రూట్‌కు దూరంగా ఉండడమే మంచిది.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..