Summer Skin Care: ఎండాకాలంలో రోజ్‌ వాటర్‌తో ఇలా చేస్తే చర్మం కాంతివంతం..!

|

Apr 26, 2022 | 12:45 PM

Summer Skin Care: వేసవిలో చర్మాన్ని రక్షించడానికి చాలామంది అనేక రకాల పద్ధతులని అవలంభిస్తారు. అందులో ఒకటి రోజ్ వాటర్ వాడటం.

Summer Skin Care: ఎండాకాలంలో రోజ్‌ వాటర్‌తో ఇలా చేస్తే చర్మం కాంతివంతం..!
Rose Water
Follow us on

Summer Skin Care: వేసవిలో చర్మాన్ని రక్షించడానికి చాలామంది అనేక రకాల పద్ధతులని అవలంభిస్తారు. అందులో ఒకటి రోజ్ వాటర్ వాడటం. ఇది గులాబీ రేకుల ద్వారా తయారు చేస్తారు. ఈ పద్దతి ఇరాన్‌లో ప్రారంభమైంది. రోజ్‌వాటర్ చర్మ సంరక్షణలో అత్యుత్తమ ఫలితాలను అందిస్తుంది. అంతేకాదు ఇది మార్కెట్‌లో చాలా చౌకగా లభిస్తుంది. రోజ్ వాటర్ చర్మం pH స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. రోజ్‌ వాటర్‌ ఎలా వాడాలో తెలుసుకుందాం.

ఎండాకాలంలో చర్మంపై టానింగ్ రావడం సర్వసాధారణం. అయితే దీని వల్ల ముఖం కాంతి విహీనంగా తయారవుతుంది. టానింగ్ లేదా సన్ బర్న్ ను రోజ్ వాటర్‌తో తొలగించవచ్చు. ఒక పాత్రలో 200 మి.మీ. రోజ్ వాటర్ తీసుకుని అందులో యాపిల్ సైడర్ వెనిగర్, అలోవెరా జెల్, కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమాన్ని కొంత సమయం పాటు ఉంచిన తర్వాత చర్మంపై ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. తర్వాత మిశ్రమం ఆరిపోయినప్పుడు చల్లటి నీటితో కడగండి. రోజ్ వాటర్ చర్మాన్ని సూర్యకిరణాల నుంచి కాపాడుతుంది. కలబంద కమిలిన చర్మాన్ని బాగు చేస్తుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ కూలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

రోజ్ వాటర్‌లో శెనగపిండి, ఆరెంజ్ పౌడర్, గ్లిజరిన్, పసుపు కలిపి వాడితే చర్మంపై వచ్చే మొటిమలు తొలగిపోతాయి. వీటన్నింటిని మిక్స్ చేసి ఒక ప్యాక్ తయారు చేసి ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేయాలి. ఆరిపోయిన తర్వాత చల్లని నీటితో కడగాలి. రోజ్ వాటర్ పసుపులో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి.

చాలా మంది రోజ్ వాటర్‌ని చర్మ సంరక్షణలో టోనర్‌గా ఉపయోగిస్తారు. రోజ్ వాటర్‌ని ఒక పాత్రలో తీసుకుని కాటన్ బాల్స్ సహాయంతో చర్మంపై అప్లై చేయండి. కావాలంటే రోజ్ వాటర్ లో కొంచెం ఆయిల్ చుక్కలు వేసి స్ప్రే బాటిట్‌లో పెట్టుకోండి. రాత్రి పడుకునే ముందు చర్మంపై స్ప్రే చేయండి. ఇలా చేయడం వల్ల రంధ్రాలలో ఉండే మురికి, అదనపు నూనె బయటకు వచ్చి చర్మం బిగుతుగా తయారవుతుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

RR vs RCB Prediction: ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్, యుజ్వేంద్ర చాహల్‌.. బెంగుళూరుకి విజయం అంత సులువు కాదు..!

CBSE Syllabus: సీబీఎస్‌ఈ సిలబస్‌లో మార్పులు..10వ తరగతిలో 25 కొత్త టాపిక్‌లు..12వ తరగతిలో 30 కొత్త టాపిక్‌లు..!

British Woman: 99 ఏళ్ల వయసులో యుద్ద విమానం నడిపిన మహిళ.. ఆమె ఆత్మవిశ్వాసానికి హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే..!