Black Coffee: వీరికి బ్లాక్‌ కాఫీ అస్సలు మంచిది కాదట.. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర దుష్ప్రభావాలు

|

Oct 31, 2022 | 12:14 PM

కొంతమంది  బ్లాక్ కాఫీ తాగడాన్ని ఒక  వ్యసనంగా మార్చకుంటారు . గ్యాప్ లేకుండా  కప్పుల మీద కప్పుల కాఫీ తాగేస్తుంటారు. ఇలాంటి వారికి ఆరోగ్యం పరంగా పలు సమస్యలు తలెత్తుతాయి.

Black Coffee: వీరికి బ్లాక్‌ కాఫీ అస్సలు మంచిది కాదట.. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర దుష్ప్రభావాలు
Black Coffee
Follow us on

ఇతర దేశాల్లో పోల్చితే మన దేశంలో కాఫీ ప్రియుల సంఖ్య చాలా ఎక్కువ. పని ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది దీన్ని చాలా ఇష్టంగా తాగుతారు. మరికొందరు దీనిని ఎనర్జీ డ్రింక్‌గా కూడా ఉపయోగిస్తారు. కాఫీ తాగిన తర్వాత శరీరం అద్భుతంగా రిఫ్రెష్‌గా ఉంటుంది. ఓ నిర్ణీత పరిమాణంలో కాఫీ తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే కొంతమంది  బ్లాక్ కాఫీ తాగడాన్ని ఒక  వ్యసనంగా మార్చకుంటారు . గ్యాప్ లేకుండా  కప్పుల మీద కప్పుల కాఫీ తాగేస్తుంటారు. ఈ నేపథ్యంలో మోతాదుకు మించి కాఫీ తాగడం వల్ల గుండెపోటు వంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈవిషయంలో అలక్ష్యం వహిస్తే మెదడు సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

గుండెపోటుతో పాటు..

కాఫీ తాగడం వల్ల మీ శరీరం రిఫ్రెష్ అవుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని నిద్రలేమి, అలసట తొలగిపోతాయి. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంపై చెడు ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెరుగుతున్న కెఫిన్ నిద్రలేమికి కారణమవుతుంది. ఇది క్రమంగా పనిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాగా డిమెన్షియా అనేది ఒక రకమైన మానసిక సమస్య. దీని బారిన పడిన వారు మానసికంగా కుంగిపోతారు. వారి ప్రవర్తన సాధారణ మనుషుల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రోజుకు 5 నుండి 6 కప్పులు లేదా అంతకంటే ఎక్కువ కాఫీ తాగే వారికి డిమెన్షియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనితో పాటు, అధిక కెఫిన్ అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. మోతాదుకు మించి కెఫిన్ త్వరగా రక్తపోటును పెంచుతుంది. దీని వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్ర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. బీపీ ఎక్కువగా ఉన్నవారు బ్లాక్ కాఫీని ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి