Health: తిన్న వెంటనే స్నానం చేయకూడదని అంటారు.. దానివెనకున్న రహస్యం ఇదే..!

|

Feb 08, 2023 | 6:43 AM

తినే ఆహారం, తాగే నీళ్లు, పండ్ల రసాలకు సంబంధించి రకరకాల సూచనలు, సలహాలు చేస్తారు పెద్దలు. ఆహార నియమాలకు సంబంధించి తరతరాల నుంచి కొన్ని పద్ధతులు ఉన్నాయి.

Health: తిన్న వెంటనే స్నానం చేయకూడదని అంటారు.. దానివెనకున్న రహస్యం ఇదే..!
Bathing
Follow us on

తినే ఆహారం, తాగే నీళ్లు, పండ్ల రసాలకు సంబంధించి రకరకాల సూచనలు, సలహాలు చేస్తారు పెద్దలు. ఆహార నియమాలకు సంబంధించి తరతరాల నుంచి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిన మన మన ఇళ్లలోని పెద్దలు చెబుతూనే ఉంటారు. టీ తాగిన తరువాత నీళ్లు తాగకూడదని, పాలలో ఉప్పు కలిపి తాగకూడదు, ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదని చెబుతుంటారు. అయితే, చాలామంది తిన్న వెంటనే స్నానం ఎందుకు చేయకూడదని సందేహపడుతుంటారు. అసలు భోజనానికి, స్నానానికి సంబంధం ఏంటని ఆలోచిస్తుంటారు. మరి వీటి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తిన్న వెంటనే స్నానం ఎందుకు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నిజం ఎంత?

ఆహారం తిన్న తర్వాత స్నానం చేయకూడదని చెప్పే శాస్త్రీయ ఆధారాలు లేవని చాలా నివేదికలలో ధృవీకరించబడింది. కొన్ని నివేదికలలో స్నానం చేయడం వల్ల తాజాగా, శక్తివంతంగా అనుభూతి చెందుతారని, ఇది మీ శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని చెప్పడం జరిగింది.

అయితే, తిన్న వెంటనే తలస్నానం చేయడం వల్ల రక్తపోటు తగ్గుముఖం పడుతుందని, దీనివల్ల తలతిరగడం లేదా కళ్లు తిరగడం వంటివి జరుగుతాయి. ఆహారం తిన్న తర్వాత స్నానం చేయడానికి ముందు కాసేపు వేచి ఉండటం మంచిది. ముఖ్యంగా తక్కువ రక్తపోటు ఉన్నట్లయితే ఎప్పుడూ తిన్నతరువాత స్నానం చేయకూడదు.

ఇవి కూడా చదవండి

బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా ఉండాలి..

మీరు ఎప్పుడైనా ఆహారం తిన్నా, ఆహారం జీర్ణం కావడానికి చాలా శక్తి, రక్తపోటు అవసరం. అయితే, తిన్న తర్వాత స్నానానికి వెళితే.. అప్పుడు BP తక్కువగా ఉంటుంది. దాంతో ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ కారణంగా ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదని అంటుంటారు. అయితే, తినడానికి, స్నానానికి మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..