Banana For weight loss: ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు పలు రకాల డైట్లు పాటిస్తున్నారు. అయితే.. కొన్ని పండ్లు బరువు తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి.. అటువంటి పండ్లను తినడం వల్ల ఆకలి కూడా తగ్గుతుంది. దీని కారణంగా అవసరమైన పోషకాలు కూడా శరీరంలో లభిస్తాయని.. బరువు కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అటువంటి పండ్లల్లో అరటి పండు ఒకటి. అరటి పండు తక్కువ ధరతో పాటు.. అన్ని సీజన్లలో సులభంగా దొరుకుతుంది. ఇది కాల్షియం మంచి మూలం. ఇది తిన్న తర్వాత 2 లేదా 3 గంటల వరకు మీకు ఆకలి అనిపించదు. దీనిని తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక రకాల వ్యాధులు కూడా దూరమవుతాయి. అరటి పండు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం…
అరటిపండులో ఎన్నో పోషకాలు..
ఇతర పండ్ల కంటే అరటిపండ్లు కూడా తక్కువ ధరకే లభిస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే స్టార్చ్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.
అరటిపండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
బరువు తగ్గడంతో పాటు, అనేక సమస్యలకు ఇది సహాయపడుతుంది. మీ ఎముకలలో నొప్పి ఉంటే ఈ పండును తప్పక తినాలి. దీని వల్ల శరీరానికి కాల్షియం పుష్కలంగా లభిస్తుంది.. ఎముకలు దృఢంగా మారుతాయి.