Summer Health Tips: వేసవిలో పిల్లలు జాగ్రత్త.. ఈ చిట్కాలను పాటించండి సురక్షితంగా ఉండండి..!

|

Apr 13, 2022 | 7:24 AM

Summer Health Tips: ఈ సారి వేసవి కాలంలో ఎండలు భగభగ మండిపోతున్నాయి. మార్చి నెలలో దంచికొట్టిన ఎండలు.. ఏప్రిల్‌లో మరింత పెరిగాయి.

Summer Health Tips: వేసవిలో పిల్లలు జాగ్రత్త.. ఈ చిట్కాలను పాటించండి సురక్షితంగా ఉండండి..!
Child Care
Follow us on

Summer Health Tips: ఈ సారి వేసవి కాలంలో ఎండలు భగభగ మండిపోతున్నాయి. మార్చి నెలలో దంచికొట్టిన ఎండలు.. ఏప్రిల్‌లో మరింత పెరిగాయి. దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. మార్చిలోనే 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు దాటగా.. ఇప్పుడు మరింత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జడుసుకుంటున్నారు. అయితే, ఈ వేసవిలో ముఖ్యంగా నవజాత శిశువులకు ఇబ్బందిగా ఉంటుంది. అనేక అనారోగ్య సమస్యలు వారిని వేధిస్తాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వేసవి తాపం నుంచి నవజాత శిశువులను రక్షించవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చిన్న పిల్లలకు వేసవిలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పిల్లలకు చెమటలు పడుతుంది. ఆ చెమటల వల్ల శరీరంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగించడానికి వేసవిలో ప్రతిరోజూ పిల్లలకు స్నానం చేయించాలి. దీంతోపాటు పిల్లల శరీరాన్ని రోజుకు రెండు మూడు సార్లు తడి గుడ్డతో తుడవాలి. దీనివల్ల శిశువు శరీరం చల్లబడి.. చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక.. పిల్లల చేతులను క్రమం తప్పకుండా శుభ్రపరచాలి. పిల్లలు తరచుగా తమ నోటిలో చేతులను పెట్టుకుంటారు. ఇది ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే.. పిల్లల చేతులను నిరంతరం శుభ్రం చేస్తుండాలి.

వేసవి కాలంలో పిల్లలకు సౌకర్యవంతమైన దుస్తులు వేయాలి. టైట్‌గా ఉండే డ్రెస్‌లు వేయడం వల్ల పిల్లల శరీరంపై దద్దుర్లు వస్తాయి. ఇక పిల్లలను బయటకు తీసుకెళ్లినప్పుడు.. తలపై టోపీ గానీ, బేబీ క్యాప్ గానీ పెట్టాలి. సాయంత్రం వేళ దోమల నుంచి కాపాడేందుకు దోమల తెరలను ఉపయోగించండి. ఇక వేసవి కాలంలో పిల్లల ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లలు 6 నెలల కన్నా తక్కువ వయసు ఉంటే.. వారికి అస్సలు నీళ్లు తాపొద్దు. 6 నెలల వరకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి. పిల్లల గదికి వెంటిలేషన్ చాలా ముఖ్యం. గదిలో గాలి వచ్చేలా చూసుకోవాలి. పగటిపూట గది తలుపు మూసి ఉంచండి. దీని వల్ల పిల్లలకు వేడి గాలి రాదు. సాయంత్రం, ఉదయం సమయాల్లో పిల్లలను తాజా గాలికి తిప్పాలి.

Also read:

Hair Care Tips: వేసవిలో అందమైన, మెరిసే జుట్టు కావాలా?.. అయితే, ఈ చిట్కాలను పాటించండి..!

US President Biden: అమెరికా అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. గన్ కల్చర్‌పై ప్రత్యేక ఫోకస్..

Russia – Ukraine War: ‘అమ్మా స్వర్గంలో కలుస్తా!’.. రష్యా దాడిలో చనిపోయిన తల్లికి 9 ఏళ్ల బాలిక లేఖ..