Ayurvedic Remedies: ఎసిడిటీ, అజీర్ణంతో బాధపడుతున్నారా.. ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి.. అద్భుత ఫలితం మీ సొంతం..

Ayurvedic Remedies: మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు అనే క "చాలా దుష్ప్రభావాలు" కలిగి ఉన్నాయని ఆయుర్వేద(Ayurvedic) నిపుణుడు డాక్టర్ దీక్షా భావ్‌సర్( Dr Dixa Bhavsar)చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో..

Ayurvedic Remedies: ఎసిడిటీ, అజీర్ణంతో బాధపడుతున్నారా.. ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి.. అద్భుత ఫలితం మీ సొంతం..
Ayurvedic Remedies

Updated on: Jan 27, 2022 | 2:39 PM

Ayurvedic Remedies: మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు అనే క “చాలా దుష్ప్రభావాలు” కలిగి ఉన్నాయని ఆయుర్వేద(Ayurvedic) నిపుణుడు డాక్టర్ దీక్షా భావ్‌సర్( Dr Dixa Bhavsar)చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎసిడిటీ , అజీర్ణాన్ని (acidity and indigestion )నివారించడానికి ఉపయోగ పడే నివారణలను తెలియజేశారు. నిజానికి “ఒక వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకునే కంటే.. వ్యాధి రాకుండా నివారణ ఉత్తమం’ అనే నానుడి. ఇటీవల కాలంలో ఎసిడిటీ , అజీర్ణం వంటి సమస్యలను ఎదిర్కొనేవారి సంఖ్య అధికమయింది. వీటిని నిరోధించడానికి డాక్టర్ భావ్‌సర్ సిఫార్సు చేసిన ఆయుర్వేద నివారణలు తెలుసుకుందాం..

ఇక్కడ పోస్ట్‌ను చూడండి:

డాక్టర్ భావ్‌సర్ సిఫార్సు చేసిన ఆయుర్వేద నివారణలు:

*భోజనంలో ఎక్కువ కారం, పులుపు, పులియబెట్టిన, వేయించిన, ఫాస్ట్ ఫుడ్‌ను తీసుకోవడం తగ్గించండి. తాజా పండ్లు, కూరగాయలతో నిండిన ఆరోగ్యకరమైన ,పోషకమైన ఆహారాన్ని తీసుకోండి.
*భోజన అతిగా తినకూడదు. కొంచెం కొంచెంగా రోజులో మూడు నాలుగు సార్లు తినండి. పుల్లని పండ్లకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.
*ఎసిడిటీ ఉన్నవారు ఎక్కువ సేపు ఆకలితో ఉండకండి. భోజనం , ముఖ్యంగా మధ్యాహ్న భోజనం దాటవేయవద్దు. సమయానికి తినడం అలవాటు చేసుకోండి.
*ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి, ఉప్పు, నూనె, మిరపకాయలు మొదలైన వాటిని చాలా తరచుగా మానుకోండి. మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది.
*ఆహారం తీసుకున్న వెంటనే పడుకోవడం , పడుకోబెట్టడం మానుకోండి.
* ధూమపానం, మద్యం , టీ, కాఫీ లతో పాటు ఆస్పిరిన్ వంటి మందులకు దూరంగా ఉండండి.
* ఒత్తిడికి దూరంగా ఉండటం.

అజీర్ణం , అసిడిటీని నివారించడానికి డాక్టర్ భావ్‌సర్ కొన్ని ఆయుర్వేద ఆహారపు అలవాట్లను కూడా సూచించారు..
* కొత్తిమీర వాటర్ తాగండి
*భోజనం తర్వాత అర టీస్పూన్ మెంతులు గింజలను నమలండి.
* ఉదయం లేవగానే ముందుగా కొబ్బరి నీళ్లు తాగండి.
*మధ్యాహ్నం మెంతుల రసం త్రాగాలి. తీపి కోసం మిస్రీని జోడించవచ్చు .
* ఎండుద్రాక్షను రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగాలి.
* నిద్రవేళలో 1 టీస్పూన్ ఆవు నెయ్యితో గోరువెచ్చని పాలు తాగండి .
*రోజ్ వాటర్ , పుదీనా నీరు త్రాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి.
* దానిమ్మ , అరటిపండ్లు, రేగు పండ్లు, ఎండుద్రాక్ష, నేరేడు పండ్లు , కొబ్బరికాయలు మొదలైనవి సీజన్ కు అనుగుణంగా తినండి .

note ఈ చిట్కాలు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే.. వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. మీ ఆరోగ్యం లేదా వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఎల్లప్పుడూ మీ డాక్టర్ లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుల సలహాలను సూచనలు తీసుకోండి.

Read Also: