AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heavy Headedness: తల భారం, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారా..? ఆయుర్వేద చికిత్సతో ఇట్టె చెక్ పెట్టొచ్చు..

Ayurvedic Cure For Heavy Headedness: ప్రస్తుత కాలంలో మానసిక సమస్యలు చాలామందిని వెంటాడుతున్నాయి. అయితే, మనలో చాలా మంది మానసిక ఆరోగ్యాన్ని అంత సీరియస్‌గా తీసుకోరు. కానీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి.

Heavy Headedness: తల భారం, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారా..? ఆయుర్వేద చికిత్సతో ఇట్టె చెక్ పెట్టొచ్చు..
Heavy Headedness
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 06, 2023 | 12:21 PM

Ayurvedic Cure For Heavy Headedness: ప్రస్తుత కాలంలో మానసిక సమస్యలు చాలామందిని వెంటాడుతున్నాయి. అయితే, మనలో చాలా మంది మానసిక ఆరోగ్యాన్ని అంత సీరియస్‌గా తీసుకోరు. కానీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ రోజుల్లో ప్రజలు అనేక రకాల ఒత్తిడిని ఎదుర్కొంటారు. దీని కారణంగా శరీరం, తల బరువుగా మారడం ప్రారంభమవుతుంది. వెన్ను నొప్పి, మెడ గుంజడం, తలనొప్పి తీవ్రస్థాయిలో పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో.. పెయిన్ కిల్లర్స్ లేదా మరేదైనా మందులు తీసుకోవడం ప్రమాదకరం. ఎందుకంటే చాలా పరిశోధనలు వాటి దుష్ప్రభావాలను వెల్లడించాయి. దానికి కొంత ఆయుర్వేద చికిత్స తీసుకోవడం మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. తలనొప్పి తీవ్రంగా వేధిస్తున్న సమస్యకు ఆయుర్వేదంతో చెక్ పెట్టవచ్చని పేర్కొంటున్నారు. తలనొప్పికి ఆయుర్వేద చికిత్స ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి..

తలలో భారం, తలనొప్పి సమస్య నుంచి విముక్తి కోసం ఆయుర్వేద చికిత్స..

తలలో భారం లేదా మానసిక అలసటకు అనేక కారణాలు ఉండవచ్చు. ఇందులో దీర్ఘకాలిక అనారోగ్యం, పని ఓవర్‌లోడ్, ఎక్కువ కాలం మందులు తీసుకోవడం లేదా వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. దీని కోసం మీరు 3 రకాల ఆయుర్వేద ఔషధాలను తీసుకోవచ్చు… వాటి గురించి తెలుసుకోండి..

  1. బ్రాహ్మీ: మానసిక అలసట, తల భారం, తలనొప్పి బాధపడేవారు తరచుగా జ్ఞాపకశక్తి కోల్పోతూ ఉంటారు. దీనిని వదిలించుకోవడానికి బ్రాహ్మిని తినవచ్చు. ఇది మానసిక భారం, అలసట నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
  2. అశ్వగంధ: అశ్వగంధ ఒక ఆయుర్వేద ఔషధం. ఇది మానసిక రుగ్మతలు, తలలో భారం కోసం ఖచ్చిత నివారణగా పరిగణిస్తారు. మీరు మానసికంగా చురుకుగా, టెన్షన్ లేకుండా ఉండటానికి దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే గుణాలు మన మెదడుకు అన్ని విధాలా మేలు చేస్తాయి.
  3. శంఖపుష్పి: శంఖపుష్పి తీసుకోవడం మెదడుకే కాకుండా శరీరానికి కూడా సమానంగా మేలు చేస్తుంది. దీన్ని ఆయుర్వేద నిధి అని పిలవడం బహుశా తప్పు కాదు. మనసులోని భారాన్ని దూరం చేస్తుంది. మీరు ఈ పువ్వుతో తయారు చేసిన షర్బట్ లేదా సిరప్ తాగవచ్చు.

గమనిక: ఇవి ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. కేవలం అవగాహన కోసం మాత్రమే ఇస్తున్నాం.. వీటిని ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి