Pomegranate Leaves: దానిమ్మ పండు పోషకాలు మెండు.. దానిమ్మ పండుతింటే.. ఆరోగ్యానికి మేలు అన్న సంగతి తెలిసిందే. దానిమ్మ తింటే..అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే దానిమ్మ పండు మాత్రమే కాదు.. ఆకులు, బెరడు కూడా అనేక వ్యాధ్యులను నివారిస్తుంది. దాడిమీ పత్రి అంటూ వినాయక చవితి రోజున గణపతిని పూజిస్తాం.. ఈ ఆకు పత్రి పూజా క్రమంలో పన్నెండవది. ఇక దానిమ్మ పండులాగే ఆకు కూడా ఎరుపు రంగులో చిన్నగా, గుండ్రంగా ఉంటుంది. ఈ ఆకు పసరు వాసన వస్తుంది. ఈ పత్రి విశిష్టత ఆయుర్వేదంలో చెప్పబడింది. దానిమ్మ ఆకులతో ఏఏ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసుకుందాం..
*ఆయుర్వేదంలో దానిమ్మ ఆకుని కుష్టు వ్యాధి, చర్మ రోగాల నివారణకు ఉపయోగిస్తారు.
*దానిమ్మ ఆకుల కషాయంగా చేసుకుని రోజుకు రెండు సార్లు తాగితే.. సీజనల్ దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. (దానిమ్మ ఆకులను శుభ్రం చేసి.. నీటిలో మరిగిస్తే కాషాయం రెడీ)
*నిద్ర లేమి వారికి దివ్య ఔషధం దానిమ్మ ఆకుల పేస్ట్ తో చేసిన కాషాయం.. మూడు వంతుల నీటిలో దానిమ్మ ఆకుల పేస్ట్ ని వేసి.. ఆ నీరు అర వంతు వచ్చే వరకూ మరిగించి.. ఈ నీటిని రోజూ రాత్రి నిద్ర పోయేముందు తాగితే సుఖ నిద్ర మీ సొంతం.
* గజ్జి, తామర వంటి స్కిన్ సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతుంటే.. దానిమ్మ ఆకులను పేస్ట్ ను అప్లై చేస్తే నయం అవుతుంది. అంతేకాదు శరీరం మీద ఉన్న పుండ్లు, గాయాలు త్వరగా తగ్గుతాయి.
*చెవి, నొప్పి ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడేవారు దానిమ్మ ఆకుల నుంచి రసం తీసుకుని.. అందులో నువ్వుల నూనె లేదా ఆవ నూనె కలిపి…ఆ మిశ్రమాన్ని రెండు చుక్కలు రెండు చెవుల్లో వేస్తుంటే.. చెవి నొప్పి, ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
*నోటి సంబంధిత వ్యాధుల నుంచి మంది ఉపశమనం లభిస్తుంది. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్య, నోటిలో పుండ్లు ఉంటె.. దానిమ్మ ఆకుల రసాన్ని నీటిలో కలిపి ఆ నీటితో పుక్కిలిస్తుండాలి. దీంతో నోటి సమస్యలు నివారింపబడతాయి.
* ముఖంపై మొటిమలు తగ్గడానికి బెస్ట్ చిట్కా దానిమ్మ ఆకుల పేస్ట్‌ను మొటిమలపై రాస్తుంటే మొటిమలు తగ్గిపోతాయి.
*అజీర్ణం, మలబద్దకం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు తరచుగా ఏర్పడుతుంటే.. దానిమ్మ ఆకుల జ్యుస్ రోజుకు రెండు టి స్పాన్లు మేర తాగవచ్చు.
Also Read: ఆ గ్రామంలో రూ.90 లకే ఇల్లు.. ఎవరైనా ఖరీదు చేయవచ్చు.. అయితే కండిషన్స్ అప్లై..