
ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో బట్టలు ఉతికేందుకు చాలా మంది వాషింగ్ మెషిన్ నే ఉపయోగిస్తున్నారు. అయితే కేవలం వాషింగ్ మెషిన్ లో ఉతకడమే కాకుండా.. దాన్ని శుభ్రంగా ఉంచడాన్ని పెద్దగా పట్టించుకోరు. వాషింగ్ మెషిన్ కి కూడా శుభ్రత అవసరమా అంటే.. అవసరమే. దాన్ని క్లీన్ గా నీట్ గా ఉంచుకుంటే.. చాలా కాలం మన్నికగా వస్తుంది. అలాగే దుమ్ము ధూళి, మురికి పేరుకుపోయి పాడవకుండా ఉంటుంది. మరి వాషింగ్ మెషిన్ ను జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి, పాడవకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెనిగర్, బేకింగ్ సోడాతో వాషింగ్ మెషిన్ ని క్లీన్ చేసుకుంటే.. శుభ్రంగా ఉంటుంది. ఒక కప్పు వెనిగర్, కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఆ మిశ్రమాన్ని వాషింగ్ మెషీన్ లోని డిటర్జెంట్ బాక్స్ లో వేసుకోవాలి. మెషీన్ బట్టలేమీ వేయకుండా 5-10 నిమిషాల పాటు రన్ చేశాక.. ఆఫ్ చేసుకోవాలి. వాటర్ డ్రైన్ అయ్యాక.. శుభ్రమైన క్లాత్ తీసుకుని లోపల డ్రమ్ శుభ్రం చేసుకోవాలి.
అలాగే ఫ్రంట్ టోర్ వాషింగ్ మెషిన్లు అయితే.. డోర్ వద్ద ఆగిన నీటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పాచి పట్టకుండా ఉంటుంది. ఆ తర్వాత డోర్ ఓపెన్ చేసి కాసేపు అలా వదిలేయాలి. ఇలా చేస్తే లోపల తడిపోయి పొడిగా ఉంటుంది.
ఇక ఫిల్టర్ విషయానికొస్తే.. ఇది తేమతో కూడి ఉంటుంది కాబట్టి.. దీనిలో కూడా పురుగులు వస్తాయి. దీనికి ఎప్పటికప్పుడు ఖాళీగా ఉంచాలి. లోపలి చెత్త తీసేయాలి. లోపల జమ అయిన మురికిని అంతా తీసేయాలి.
ఈ చిట్కాలు కూడా పాటిస్తే వాషింగ్ మెషిన్ జాగ్రత్తగా చూసుకోవచ్చు. వాషింగ్ మెషిన్ ను గోడకు దగ్గరగా పెట్టకూడదు. దీని వల్ల వెనుక ఉండే పైపులు దెబ్బతింటాయి. వాషింగ్ మెషిన్ పైపులు లీకేజీ లేకుండా చూసుకోవాలి. వాషింగ్ మెషిన్లకు పౌడర్లకు బదులు లిక్విడ్ డిటర్జెంట్లు వాడితే మంచింది
పౌడర్లు వాడటం వల్ల అవి మెషిన్ లో పేరుకుపోయే అవకాశాలు ఉంటాయి. వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతికిన తర్వాత డోర్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. దీని వల్ల లోపల తేమ పోయి పొడిగా మారుతుంది. దీని వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి